Weight Loss : వ్యాయామం చేయకుండా వెయిట్ లాస్ అవ్వాల‌నుకుంటారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది.అధిక బరువు కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

 Follow These Simple Tips To Lose Weight Without Exercise-TeluguStop.com

పైగా మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటి ఎన్నో వ్యాధులకు అధిక బరువు కారణం అవుతోంది.అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంటారు.

అయితే కొందరికి బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాయామం చేసేంత సమయం ఉండదు.

Telugu Exercise, Tips, Latest, Simple Tips-Telugu Health

అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే వ్యాయామం చేయకపోయినా బరువు త‌గ్గొచ్చు.వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారు తమ బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తప్పక సేవించాలి.

అలాగే బరువు తగ్గాలి అనుకుంటున్న వారు షుగర్ ని పూర్తిగా దూరం పెట్టండి.మరియు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్( Fast food, junk food ), ప్రాసెస్ చేసిన ఆహారాలకు స్వస్తి పలకండి.

Telugu Exercise, Tips, Latest, Simple Tips-Telugu Health

వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలి అని భావిస్తుంటే రెగ్యులర్ గా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్( Detox drink ) ను తీసుకోవడానికి ప్రయత్నించండి.డీటాక్స్ డ్రింక్స్ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి.అదే సమయంలో మెటబాలిజం రేటును పెంచి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తాయి.అలాగే బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒత్తిడి ఒకటి.అయితే ఒత్తిడిని అదుపు చేయడంలో విటమిన్ సి అద్భుతంగా సహాయపడుతుంది.విటమిన్ సి రిచ్ గా ఉండే ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే ఒత్తిడి దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

పైగా విటమిన్ సి ఫుడ్స్ జీర్ణక్రియను చురుగ్గా మారుస్తాయి.శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తాయి.

ఇక వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని భావిస్తున్న వారు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి.వెయిట్ లాస్ లో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రోటీన్ ఎక్కువగా బీన్స్, ధాన్యాలు, గింజలు మరియు సోయా వంటి ఆహార పదార్థాలలో ఉంటుంది.ప్రోటీన్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ గంటలు పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.

చిరు తిళ్ళుపై మనసు మళ్లకుండా ఉంటుంది.ఇలా చిన్న చిన్న టిప్స్ ను పాటించడం ద్వారా వ్యాయామం చెయ్యకపోయినా సరే బరువు త‌గ్గ‌వ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube