వేసవికాలం( summer season ) రావడంతో ఎండలు బాగా మండిపోతున్నాయి.ఈ ఎండాకాలంలో వేడి వలన ప్రతి ఒక్కరు కూడా వేడిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే వేడిని తగ్గించేందుకు ఉపయోగపడే ఎన్నో రకాల ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటారు.పటిక బెల్లం( Alum jaggery ) కూడా వేసవికాలంలో మనకు చాలా ఉపయోగపడుతుంది.
పటిక బెల్లం ను మిశ్రీ లేదా ఇండియన్ రాక్ షుగర్( Indian Rock Sugar ) అని పిలుస్తారు.ఇది దేవునికి ప్రసాదంగా కూడా చాలామంది నివేదిస్తూ ఉంటారు.
పటిక బెల్లం అంటే ఏదో కాదు శుద్ధి చేయని చక్కెర.చెరుకు సిరప్( Sugarcane syrup ) తో దీన్ని తయారు చేస్తారు.అయితే చక్కెర, చెరుకులతో పోలిస్తే పటిక బెల్లంతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సాధారణ చెక్కరకు బదులుగా పట్టిక బెల్లాన్ని ఉపయోగిస్తే జీవ క్రియకు మేలు జరుగుతుంది.
అంతేకాకుండా వీటిలో ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఖనిజాలు, సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.అందుకే ఆయుర్వేదం ప్రకారం ఆరు రుచులతో కూడిన భోజనమే ఆరోగ్యకరమైనది.

ఇక చాలామంది తీపి రుచి కోసం చాలా రకరకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు.అయితే అందులో చక్కెరను ఉపయోగిస్తుంటారు.చక్కెరకు బదులు చిన్న ముక్క పటిక బెల్లం ఉపయోగించడం చాలా మంచిది.ఇది శరీరంపై శీతలికరణ ప్రభావాన్ని చూపిస్తుంది.అంతేకాకుండా శరీరం నుంచి వాత, పిత్తా, కఫా లాంటి మూడు దోషాలను కూడా సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది.ఇక వేసవికాలంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
అయితే ఈ సమయంలో పటిక బెల్లంతో రిఫ్రెష్ డ్రింక్స్ తయారు చేసుకోనీ తాగవచ్చు.

పంచదారకు బదులుగా పటిక బెల్లాన్ని ఆ డ్రింక్లలో వేస్తే చాలు.ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.అంతేకాకుండా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ ను కూడా అందిస్తుంది.
ఇక దీన్ని తీసుకున్నప్పుడు మనసు కూడా రిలాక్స్ గా అనిపిస్తుంది.ఇక ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్ ఫాస్పరస్ లాంటి ఖనిజాలు చాలా అవసరం అవుతాయి.
ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.అందుకే ఈ వేడి ఉష్ణోగ్రతలో పటిక బెల్లాన్ని తీసుకుంటే చాలా చలువ చేస్తుంది.