చిదంబర రహస్యం అంటే ఏమిటి..?

చిదంబర రహస్యం అని చాలా సార్లు వినే ఉంటాం.ఏదైన రహస్యం మాట్లాడినప్పుడో… దాని గురించి తెలుసుకునే సందర్భంలోనో చిదంబర రహస్యం అనే పదం వినిపిస్తూ ఉంటుంది.

 Do You Know About Chidambara Rahasyam Details, Chidambara Rahasyam, Tamil Nadu,-TeluguStop.com

అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి.? ఆ ఆలయంలో అసలు రహస్యం ఏమై ఉంటుంది.? తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉంది.అక్కడ ఉన్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధి చెందినది.

పృథ్వీ, అగ్ని, వాయువు, తేజస్సు, ఆకాశ లింగాలను పంచ భూత లింగాలు అని అంటారు.వాటిలో ఆకాశ లింగం చిదంబరంలో ఉంది.

మరో శాస్త్రం ప్రకారం పరమేశ్వరుడు 8 రూపాల్లో విరాజిల్లుతూ ఉంటాడు.

ఇందులో ఐదు రూపాలు పంచభూత తత్వానికి సంకేతం.

మరో రెండు రూపాలు సూర్య, చంద్రుల రూపాలకు సంకేతం.ఇక ఆఖరిది, ఎనిమిదవ రూపం ఆత్మకు సంకేతం.

వీటినే అష్ట మూర్తులు అని పిలుస్తుంటారు. ఇక చిదంబరంలో ఉండే పరమేశ్వర తత్వం ఆకాశ తత్వానికి సంకేతంగా పిలుస్తారు.

ఈ దేవాలయంలో లింగం వెనక ఒకర పరదా కట్టి ఉంటుంది.ఆ పరదా వెనక ఏమీ ఉండదు.

అంతా ఖాళీగానే ఉంటుంది.ఆకాశం అనంతం.

శోధించే కొద్దీ అందులోని రహస్యాలు ఒక్కొక్కటిగా తెలుస్తూ వస్తున్నాయి.

కానీ చూడటానికి అంతా ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది.అలాగే ఈ పరదా వెనక ఏమీ ఉండకపోయినా… పరదా మాత్రం అడ్డంగా కడతారు.ఈ ఆకాశ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకోవడమే చిదంబర రహస్యం.

ఆకాశ రూపంలోని శివుడిని దర్శించుకోవాలి అంటే ముందుగా ఆత్మ దర్శనం చేసుకోవాలి.అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచి పెట్టిన రహస్యానని చిదంబర రహస్యం అనటం ఒక పరిపాటిగా వస్తోంది.

Do You Know About Chidambara Rahasyam Details, Chidambara Rahasyam, Tamil Nadu, Akasha Lingam, Parameshwara, Maha Shiva, Nataraja Idol, Chidambara Secret, - Telugu Akasha Lingam, Chidambara, Devotional, Maha Shiva, Nataraja Idol, Parameshwara, Tamil Nadu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube