సల్మాన్ రష్డీపై దాడి: సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. నిందితుడిపై హత్యాయత్నం, దాడి అభియోగాలు

ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను అమెరికా సీరియస్‌గా తీసుకుంది.

 Author Salman Rushdie's Attacker Hadi Matar Charged With Attempted Murder, Assault , Salman Rushdie, Attack, Hadi Matar , Attempted Murder, Assault , Joe Biden , America , Biden - Harris Administration, White Hose-TeluguStop.com

సల్మాన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మాటర్‌గా గుర్తించారు.అతనిపై హత్యాయత్నం, సెకండ్ డిగ్రీ దాడి అభియోగాలు మోపినట్లు Chautauqua Country district attorney కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఆరోపణలకు సంబంధించి గురువారం రాత్రి అతనిని అరెస్ట్ చేసి బెయిల్ లేకుండా రిమాండ్‌కు పంపారని ప్రకటనలో పేర్కొన్నారు.బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 Author Salman Rushdie's Attacker Hadi Matar Charged With Attempted Murder, Assault , Salman Rushdie, Attack, Hadi Matar , Attempted Murder, Assault , Joe Biden , America , Biden - Harris Administration, White Hose-సల్మాన్ రష్డీపై దాడి: సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. నిందితుడిపై హత్యాయత్నం, దాడి అభియోగాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నిందితుడి విషయానికి వస్తే.హదీ మాటర్ అమెరికాలో పుట్టి పెరిగాడు.

న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ నివాసి.దక్షిణ లెబనాన్‌లోని యారౌన్ నుంచి వలస వచ్చిన లెబనీస్ తల్లిదండ్రులకు జన్మించాడు.

ఎన్‌బీసీ కథనాలు, హదీ సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తే….షియా తీవ్రవాదం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)కి సానుభూతిపరుడిగా తేలింది.

జనవరి 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా చేతుల్లో హతమైన ఐఆర్‌జీసీ వింగ్ అయిన ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీ చిత్రాలను మాటర్ సెల్‌ఫోన్‌లోని మెసేజింగ్ యాప్‌లో అధికారులు కొనుగొన్నారు.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), అమెరికాలోని ఇతర దర్యాప్తు సంస్థలు మాటర్ ఉద్ధేశ్యం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

మాటర్‌కు ఇరాన్ మూలాలు ఏమైనా వున్నాయా.లేక జాతీయత వుందా అనేది కూడా తెలియరాలేదు.

సల్మాన్‌పై దాడి జరిగిన రోజున సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే చౌటౌక్వా ఇన్‌స్టిట్యూషన్‌లోని ఈవెంట్ గ్రౌండ్స్‌కు మాటర్‌కు పాస్ వుందని న్యూయార్క్ స్టేట్ పోలీస్‌కి చెందిన మేజర్ యూజీన్ స్టానిస్జెవ్స్కీని తెలిపారు.రష్డీని చంపడానికి ఇరాన్ అధినేత అయతుల్లా ఖోమేనీ ఫత్వా జారీ చేసిన దాదాపు దశాబ్ధం తర్వాత మాటర్ జన్మించాడు.

అలాగే ఖోమేనీ కూడా మరణించారు.అయితే హదీ మాటర్ సెల్‌ఫోన్‌లో రెవల్యూషనరీ గార్డ్స్‌తో లింక్ చేసిన ఆధారాలు, నాటి ఫత్వాకు సంబంధించిన ఇతర విషయాలు వుండివుండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Telugu America, Assault, Attack, Biden Harris, Chautauqua, Hadi Matar, Joe Biden, Salman Rushdie, White Hose-Telugu NRI

సల్మాన్ రచించిన సాతానిక్ వెర్సెస్‌ను 1988లో ఇరాన్ ప్రభుత్వం నిషేధించింది.పుస్తకంలోని వివాదాస్పద భాగాలతో చాలామంది ముస్లింలు బాధపడుతూనే వున్నారు.అందుకే రష్డీని చంపడానికి కాలానుగుణంగా అనేక మంది బహుమతులు ప్రకటిస్తూనే వున్నారు.ఇరాన్ మద్ధతుగల లెబనాన్ అతివాద గ్రూప్ హిజ్బుల్లాకు చెందిన ఒక అధికారి శనివారం రాయిటర్స్‌తో మాట్లాడుతూ.

రష్డీపై దాడికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.అలాగే లెబనాన్‌లోని యారౌన్ మేయర్ అలీ టెహ్ఫే మాట్లాడుతూ.

హదీ మాటర్ , అతని తల్లిదండ్రులకు హిజ్బుల్లాతో సంబంధాలు వున్నాయా లేదా ఆ కుటుంబం రాజకీయ అభిప్రాయాలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

సల్మాన్ రష్డీపై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆగంతకుడి దాడి సమయంలో రచయితకు సహాయం అందించడానికి యత్నించిన వారికి బైడెన్ ధన్యవాదాలు తెలిపారు.అలాగే సల్మాన్ రష్డీ త్వరగా కోలుకోవాలని బైడెన్ – హారీస్ అడ్మినిస్ట్రేషన్ ప్రార్థిస్తున్నట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube