కేవలం ఈ రెండు పదార్థాలతో పాదాల పగుళ్లను వదిలించుకోవచ్చు.. తెలుసా?

పాదాల పగుళ్లు.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.

 You Can Get Rid Of Cracked Feet With Just These Two Ingredients! Cracked Feet, C-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్లు సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.పాదాల పగుళ్ల వల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి గురవుతుంటారు.

అలాగే నడవడానికి సైతం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.మీరు కూడా పాదాల పగుళ్లతో సతమతం అవుతున్నారా.? అయితే ఇకపై అస్సలు చింతించకండి.

ఎందుకంటే కేవలం రెండు పదార్థాలతోనే పాదాల పగుళ్లను వదిలించుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఆల‌స్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు షియా బటర్ ను వేసుకోవాలి.

ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో ఉంచి షియా బటర్ ను మెల్ట్ చేసుకోవాలి.

Telugu Almond Oil, Cracked Feet, Tips, Latest, Shea Butter-Telugu Health Tips

పూర్తిగా మెల్ట్ అయిన షియా బట్టర్ లో ‌ రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక ఇర‌వై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం స్పూన్ సహాయంతో టైట్ గా మారిన షియా బటర్ ను బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని పెట్టుకోవాలి.

Telugu Almond Oil, Cracked Feet, Tips, Latest, Shea Butter-Telugu Health Tips

రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు రాత్రి నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను పగుళ్లపై అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే పాదాల పగుళ్లు క్రమంగా మాయం అవుతాయి.పగిలిన పాదాలు కొద్ది రోజుల్లోనే మృదువుగా, కోమలంగా మారతాయి.కాబట్టి పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube