కేవలం ఈ రెండు పదార్థాలతో పాదాల పగుళ్లను వదిలించుకోవచ్చు.. తెలుసా?
TeluguStop.com
పాదాల పగుళ్లు.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.
అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్లు సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
పాదాల పగుళ్ల వల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి గురవుతుంటారు.అలాగే నడవడానికి సైతం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
మీరు కూడా పాదాల పగుళ్లతో సతమతం అవుతున్నారా.? అయితే ఇకపై అస్సలు చింతించకండి.
ఎందుకంటే కేవలం రెండు పదార్థాలతోనే పాదాల పగుళ్లను వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.
? వాటిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు షియా బటర్ ను వేసుకోవాలి.
ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో ఉంచి షియా బటర్ ను మెల్ట్ చేసుకోవాలి.
"""/"/
పూర్తిగా మెల్ట్ అయిన షియా బట్టర్ లో రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం స్పూన్ సహాయంతో టైట్ గా మారిన షియా బటర్ ను బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని పెట్టుకోవాలి. """/"/
రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు రాత్రి నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను పగుళ్లపై అప్లై చేసుకోవాలి.
రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే పాదాల పగుళ్లు క్రమంగా మాయం అవుతాయి.
పగిలిన పాదాలు కొద్ది రోజుల్లోనే మృదువుగా, కోమలంగా మారతాయి.కాబట్టి పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.
తమిళ్ హీరోలు పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధించలేరా..?