సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.వారు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా చాలా ఖరీదైనది ఉంటుంది.
అలాగే ఒకరికొకరు ఇచ్చుకునే కానుకలు కూడా చాలా ఖరీదైనవే ఉంటాయి.అయితే కానుకుల విషయంలో ఖరీదు పక్కన పెడితే విలువలు, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే అరుదైన కానుకలు ఇచ్చినప్పుడే వాటికి ఎంతో ప్రాధాన్యత ఉండటమే కాకుండా ఎప్పటికీ ఆ కానుకలను మర్చిపోలేరు.
ఇలా మర్చిపోలేని ఒక అద్భుతమైన కానుకను మెగా కోడలు ఉపాసన ( Upasana ) తన ఆడపడుచు సుస్మిత కొణిదెలకు( Susmitha Konidela ) ఇచ్చారని తెలుస్తుంది.

ఇక సుస్మితకు ఉపాసన ఇచ్చిన కానుకను సుస్మిత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన మరదలు ఉపాసన తమ్ముడు చరణ్( Charan ) గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఉపాసన ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఉపాసన సుస్మిత కోసం ఈ కానుకను అందజేశారని తెలుస్తోంది.
సుస్మిత కోసం ఉపాసన శ్రీరామ పాదాలతో( Sri Rama Paadalu ) పాటు ఓ పుస్తకాన్ని కూడా ఇచ్చారు.

చరణ్ – ఉపాసన. పార్టీకి అద్భుతమైన హోస్ట్‌లుగా ఉన్నందుకు, చాలా ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు.ఈ బహుమతి మీ ఇద్దరి గురించి చెబుతోంది.
సంరక్షణ, తరగతిలో.మీరు పాటించే విలువల గురించి చాలా మాట్లాడుతుంది అంటూ ఉపాసన ఇచ్చిన బహుమతి గురించి సుస్మిత ఎంతో గొప్పగా వర్ణించారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుస్మిత ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గాను అదే విధంగా నిర్మాతగా కూడా మారిపోయారు ప్రస్తుతం తన తండ్రి చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.