మంచి కార్డియో( Good cardio ) వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి.పైగా ఇది సులభంగా ఎక్కడైనా చేయగలిగే ఎఫెక్టివ్ ఫిట్‌నెస్ యాక్టివిటీ.
స్కిప్పింగ్ తో ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలే ఉన్నాయి.రోజుకు పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల 100 నుంచి 150 క్యాలరీలు బర్న్ అవుతాయి.
అందుకే బరువు తగ్గాలని భావించేవారు స్కిప్పింగ్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు.అలాగే స్కిప్పింగ్ హార్ట్ మసిల్స్ ( Skipping Heart Muscles )ను బలోపేతం అవుతుంది.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్కిప్పింగ్ మెంటర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.
స్కిప్పింగ్ చేసేటప్పుడు బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి.ఇవి డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తాయి.
మూడ్ ను బెటర్‌గా మారుస్తాయి.అదే విధంగా నిత్యం స్కిప్పింగ్ చేస్తే బోన్ డెన్సిటీ( Bone density ) పెరుగుతుంది.
రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.స్టామినా రెట్టింపు అవుతుంది.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొందరు మాత్రం స్కిప్పింగ్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
మరి కొందరు ఎవరు? ఎందుకు వారు స్కిప్పింగ్ చేయకూడదు.? అన్న విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భిణీలు స్కిప్పింగ్ అస్సలు చేయకూడదు.గర్భధారణ సమయంలో జంపింగ్ వంటివి మిస్ క్యారేజ్ ప్రమాదాన్ని పెంచవచ్చు.బేబీ సేఫ్టీ కోసం నెమ్మదిగా వాకింగ్ లాంటి వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి.అలాగే ఆర్థరైటిస్, మోకాలి నొప్పి, కీళ్ల గాయాలు( Arthritis, knee pain, joint injuries ) ఉన్నవారు స్కిప్పింగ్ చేయడం వల్ల మరింత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే వారు కూడా స్కిప్పింగ్ ను స్కిప్ చేస్తేనే మంచిది.

బరువు తగ్గడానికి స్కిప్పింగ్ మంచి వ్యాయామం అయినప్పటికీ.ఎక్కువ బరువు ఉన్నవారు స్కిప్పింగ్ మొదటి దశలో చేయడం వల్ల జాయింట్స్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది.అందుకే మొదట వాకింగ్ లేదా తక్కువ ఇంపాక్ట్ వ్యాయామాలు చేయాలి.
ఆ తర్వాత స్కిప్పింగ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు.హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు స్కిప్పింగ్ చేయకూడదు.
బోన్ ఫ్రాక్చర్ లేదా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా స్కిప్పింగ్ కు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం.







