యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అంతే! బుర్ఖా ధరించిన మహిళపై దాడి, ఆరుగురు అరెస్టు..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath )దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు.నేరస్తులపై “యోగి మార్క్ ట్రీట్‌మెంట్” (Yogi Mark Treatment )పేరిట చట్టాన్ని అమలు చేస్తూ, నేరాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 That's All In Yogi Adityanath's State! Burqa-wearing Woman Attacked, Six Arreste-TeluguStop.com

మతాలు, కులాలు సంబంధం లేకుండా.ఎవరైతే హద్దుమీరి ప్రవర్తిస్తారో వారిపై కఠిన శిక్షణ అనే విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇటీవలి ముజఫర్‌నగర్ ఘటనలోనూ ఇదే విధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో( Muzaffarnagar ) శనివారం దారుణ సంఘటన చోటుచేసుకుంది.

ఒక ముస్లిం యువతి బుర్ఖా ధరించి హిందూ యువకుడు సచిన్‌తో బైక్‌పై ప్రయాణిస్తుండగా, కొందరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు.ఇద్దరూ బ్యాంకులో పని చేస్తూ, లోన్ రికవరీ పనుల కోసం బయటికి వచ్చారు.

ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించి, వారి పేర్లను అడిగి యువకుడు హిందువని తెలుసుకున్న వెంటనే అతనిపై దాడి చేశారు.ఆ యువతిని సమీపంలోని ఒక దుకాణానికి తీసుకెళ్లి, ఆమె ధరించిన బుర్ఖాను తీసేయాలని ఒత్తిడి చేశారు.

ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు ఆమె జుట్టు పట్టుకుని లాగి, చెంపదెబ్బ వేశారు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సంఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది స్థానికులు ఇద్దరినీ రక్షించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.దాడికి పాల్పడిన సర్తాజ్, షాదాబ్, ఉమర్, అర్ష్, షోయబ్, షమీగా ఆరుగురిని గుర్తించారు.వీరిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

తర్వాత వీరు పోలీస్ స్టేషన్‌లో కూర్చొని క్షమాపణలు చెబుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో నిందితులు తాము చేసిన తప్పు గుర్తించి, భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడబోమని చెబుతుండటం కనిపించింది.

ఈ ఘటనపై సమాజం నుంచి తీవ్ర స్థాయిలో స్పందన వచ్చింది.బాధితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ చర్యపై నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube