గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు.. స్టార్ హీరో నాని కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) గురించి మనందరికీ తెలిసిందే.నాని ప్రస్తుతం నిర్మాతగా హీరోగా ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.

 Nani Angry Hit 3 Director Sailesh Kolanu Once Details, Nani, Hit 3 Movie, Hit 3,-TeluguStop.com

ఒకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.హీరో నాని నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలుస్తున్నాయి.

మరోవైపు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.ఇకపోతే ఇప్పుడు నాని నుంచి ఇప్పుడు మరో కొత్త సినిమా రాబోతోంది.

Telugu Sailesh Kolanu, Nani, Naniangry, Nanisailesh, Natural Nani, Tollywood-Mov

అదే హిట్ 3( Hit 3 ) సినిమా.గతంలో విడుదల అయినా రెండు సినిమాలకు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు.మే 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలకానుంది.ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే దర్శకుడికి ఒక సారి క్లాస్ పీకిన సందర్భం గురించి బయటపెట్టాడు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.

Telugu Sailesh Kolanu, Nani, Naniangry, Nanisailesh, Natural Nani, Tollywood-Mov

శైలేష్( Director Sailesh Kolanu ) ఫస్ట్ షెడ్యూల్ లో మొహమాట పడేవాడు.అన్నింటికీ నన్ను మెంటార్ లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు.నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను.నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పాను.అప్పటి నుంచి రెచ్చిపోయాడు అని నాని చెప్పుకొచ్చాడు.ఇకపోతే హిట్ 3 లో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని నాని నమ్మకంగా ఉన్నారు.అయితే ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.

హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే ఇప్పుడు రాబోతున్న హిట్ 3 మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు.ఇప్పటికే పిల్లలు, సున్నిత మసస్కులు తన సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ ఇచ్చేశాడు కూడా.

మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube