అలాంటి సినిమాలు అస్సలు చేయనని చెబుతున్న ఓదెల2 మూవీ విలన్.. అసలేమైందంటే?

ఓదెల, ఓదెల2 సినిమాలు( Odela, Odela2 movies ) బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.ఓదెల2 సినిమాలో వశిష్ట ఎన్ సింహ విలన్ గా నటించగా ఈ సినిమాలోని పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే హారర్, కాలేజ్ లవ్ స్టోరీ సినిమాలు చేయలనుకోవడం లేదని ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే టైమ్ వృథా చేసుకోవద్దని చెబుతానని ఆయన తెలిపారు.

 Odela2 Movie Villain Comments Goes Viral In Social Media Details Inside Goes Vi-TeluguStop.com

ఓదెల2 సినిమా హారర్ మూవీ కాదని దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం అని వశిష్ట ఎన్ సింహ( Vasishtha N Simha ) చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో నేను ఒక ఆత్మ పాత్ర చేశానని హీరో రోల్, విలన్ రోల్ అని కాదని ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించిందని సమాచారం అందుతోంది.

కిరాక్ పార్టీ సినిమాలో సాంగ్ పాడి సింగర్ గా తెలుగులోకి వచ్చానని ఆయన అన్నారు.

కన్నడ ఇండస్ట్రీలో నన్ను సింగర్ గా పరిచయం చేసిన అజనీష్ లోకనాథ్ ( Ajanish Loknath )గారు నన్ను తెలుగులో సింగర్ గా పరిచయం చేశారని ఆయన తెలిపారు.

ఓదెల రైల్వే స్టేషన్ రిలీజ్ తర్వాత సంపత్ నంది గారు కాల్ చేసి ఓదెల2 సినిమాలో నా పాత్ర గురించి చెప్పిన సమయంలో సర్ప్రైజ్ అయ్యానని వశిష్ట ఎన్ సింహ వెల్లడించారు.ఆ తరహా పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పానని ఆయన తెలిపారు.

Telugu Ajanish Loknath, Odela, Odela Villain, Vasishtha Simha-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో వశిష్ట ఎన్ సింహ మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తానని వశిష్ట చెబుతున్నారు.వరుస విజయాలతో వశిష్ట రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది.వశిష్ట కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube