జీలకర్ర వర్సెస్ సోంపు.. వెయిట్ లాస్‌లో ఏది ఎఫెక్టివ్‌ గా పని చేస్తుందో తెలుసా..?

జీల‌క‌ర్ర‌, సోంపు( Cumin, anise ).ఇవి రెండు ఒకేలా క‌నిపించినా దేనిక‌దే ప్ర‌త్యేక గుణాలను క‌లిగి ఉంటుంది.

 Cumin Or Fennel Seeds Which One Best For Weight Loss! Cumin, Cumin Benefits, Fen-TeluguStop.com

ఆరోగ్య ప‌రంగా జీల‌క‌ర్ర‌, సోంపు అపార‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.అలాగే బ‌రువు త‌గ్గ‌డంలో అద్భుతంగా తోడ్ప‌డ‌తాయ‌ని చెబుతుంటారు.

అది అక్ష‌రాల స‌త్యం.అయితే జీల‌క‌ర్ర‌, సోంపులో వెయిట్ లాస్ కు ఏది ఎఫెక్టివ్ గా ప‌ని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జీలకర్రలో ఉండే యాక్టివ్ కంపౌండ్స్ మెట‌బాలిజాన్ని వేగవంతం చేస్తాయి.ఇది శరీరం కేలరీలను వేగంగా ఖర్చు చేసేలా చేస్తుంది.కొన్ని స్టడీస్ ప్రకారం, జీలకర్ర‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు బాడీలో ఫ్యాట్ కట్ చేయడంలో డైరెక్ట్ రోల్ ను పోషిస్తాయ‌ని తెలుస్తోంది.అలాగే జీలకర్ర నీటిని తాగడం వలన ఆకలి తగ్గుతుంది, దాంతో తక్కువగా తినే అవకాశం ఉంటుంది.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.పైగా జీల‌క‌ర్ర మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ ( Constipation, gas, bloating )వంటి స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుంది.

Telugu Cumin Benefits, Cuminfennel, Fennel Seeds, Fennelseeds, Tips, Latest-Telu

సోంపు విష‌యానికి వ‌స్తే.ఇందులోని న్యాచుర‌ల్ డైజెస్టివ్ ఎంజైములుఆహారం త్వరగా జీర్ణం కావడంలో సహాయపడతాయి.ఫ్యాట్ స్టోరేజీ తక్కువగా ఉండేలా చేస్తాయి.సోంపు డిటాక్సిఫికేషన్‌లో( Anise in detoxification ) సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.నిత్యం సోంపు నీరు తీసుకుంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పోతాయి.ఇది మెటబాలిజాన్ని యాక్టివ్ చేస్తుంది.

సోంపు ఆపెటైట్ కంట్రోల్ గా ప‌ని చేస్తుంది.సొంపును డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఆహారం తిన్న వెంట‌నే తినాలన్న తాపత్రయం త‌గ్గుతుంది.

బెల్లీ ఫ్యాట్ ను త‌గ్గించి బాడీ స్లిమ్‌గా కనిపించడానికి ఇది సోంపు ఉపయోపడుతుంది.

Telugu Cumin Benefits, Cuminfennel, Fennel Seeds, Fennelseeds, Tips, Latest-Telu

అయితే జీల‌క‌ర్ర‌, సోంపులో ఏది బెస్ట్ అన్న విష‌యానికి వ‌స్తే.ఫ్యాట్ బర్న్, మెటబాలిజం బూస్ట్ అనే కోణంలో జీల‌క‌ర్ర బెట‌ర్ గా ఉంటుంది.పాచనం, బ్లోటింగ్‌ తగ్గించే కోణంలో సోంపు బెట‌ర్ గా ఉంటుంది.

రెండింటినీ కలిపేసుకుంటే వెయిట్ లాస్ లో ఫలితం ఇంకాస్త బాగుంటుంది.ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు, రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు తీసుకుంటే రిజ‌ల్ట్ చూసి మీరే షాక‌వుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube