సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటారు.
ఇక ఇలాంటి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన గుర్తింపు అయితే సంపాదించుకుంటారు.అలా కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక హీరోలు దర్శకులు కలిసి చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దర్శకులు మాత్రం ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఏదో ఒక సినిమా చేసేసి డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు.
ముఖ్యంగా సంపత్ నంది (Sampath Nandi) లాంటి దర్శకుడి కెరియర్ మొదట్లోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికి ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు.ఆ సినిమాని సక్సెస్ చేసినప్పటికి అది చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే కాదు.
కాబట్టి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేవి ప్రేక్షకులను అలరించడం లేదు.

ఇక దానికి తోడుగా ఆయన ప్రొడ్యూస్ చేస్తూ కథ మాటలు అందిస్తున్న సినిమాలు సైతం డిజాస్టర్లు గా మిగులుతున్నాయి.ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓదెల 2’ సినిమా( ‘Odela 2’ movie ) కూడా ఆశించిన మేరకు విజయం అయితే సాధించలేదనే విషయం ప్రతి ఒక్క ప్రేక్షకూడు కూడా చెబుతున్నాడు.మరి దీన్ని బట్టి చూస్తే సంపత్ నంది కెరీర్ అనేది ముగిసిపోయిందనే చెప్పాలి.
ఇక ఆయన అరా కొర సినిమాలు చేసిన కూడా ఆయనకు స్టార్ హీరోల నుంచి పెద్దగా అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా లేవు.దానికి తోడు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేద్దామనుకున్న వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నప్పటికి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు…
.