మీ ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే.. ఇవి మీకు ఎనలేని అదృష్టాన్ని తెచ్చి పెడతాయి..

సాధారణంగా చాలామంది వాస్తును ( Vastu ) ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ఎందుకంటే వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యల నుండి బయటపడవచ్చు.

 Keeping These Things In Your Home Gives Positive Energy Details, , Positive Ener-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో వాస్తు ను అనుసరిస్తున్నారు.వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) వ్యాపిస్తుంది.

అందుకే వాస్తు ప్రకారం అనుసరించడం చాలా మంచిది.అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మనకి ఎంతో మంచి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మనకి ఎంతో అదృష్టం వస్తుంది.

మన ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాలిడ్ సిల్వర్ లేదా కంచు ఏనుగులు( Elephant ) ఇంట్లో ఉండడం చాలా మంచిది.అలాగే ఏనుగు ఇంట్లో ఉంటే ధనం ఎప్పుడూ ఉంటుంది.

అలాగే ఏనుగుని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.అలాగే ఇంట్లో ఉన్న బెడ్ రూమ్ లోనూ కూడా ఏనుగు విగ్రహాన్ని పెట్టుకుంటే వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం బొమ్మని( Horse ) కూడా ఇంట్లో ఉంచడం చాలా మంచిది.

Telugu Calf, Horse Idol, Energy, Silver Elephant, Swans, Tortoise, Vasthu, Vasth

గుర్రం విగ్రహాన్ని ఇంట్లో పెడితే సక్సెస్ ని పొందవచ్చు.చాలామంది తమ జీవితంలో ఎన్నో పనులు చేసినప్పటికీ వారు ముందుకు వెళ్లలేకపోతుంటారు.అందుకే గుర్రం విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సక్సెస్ ని పొందవచ్చు.

గుర్రం బొమ్మని ఇంట్లో పెట్టుకోవడం వలన అనుకున్నది త్వరగా సాధించవచ్చు.ఇక ఇంట్లో జంట హంసలని కూడా ఉంచితే ఎల్లప్పుడూ కుటుంబం ఆనందంగా ఉంటుంది.

అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి.

Telugu Calf, Horse Idol, Energy, Silver Elephant, Swans, Tortoise, Vasthu, Vasth

అంతేకాకుండా తాబేలును కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది.ఇది మీకు ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది.అయితే తాబేలు విగ్రహాన్ని తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు.

అంతేకాకుండా ఆవు, దూడ విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచి ఫలితాలను అందిస్తాయి.ఆవు, దూడ విగ్రహం ఇంట్లో ఉంటే పిల్లలకి చదువు మీద ఆసక్తి కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube