మార్గశిర మాసం ఆ విష్ణు భగవానునికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పవచ్చు.ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశని,మోక్షదైకాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తెరవటం వల్ల భక్తులందరూ ఆ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అందువల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.
పూర్వం వైఖానసుడు అనే రాక్షసుడికి నరకం ప్రాప్తించడం వల్ల తన తండ్రిని నరక లోకం నుంచి మోక్షం కలిగించడానికి ఏకాదశి రోజున ఉపవాసంతో వ్రతం ఆచరిస్తారు.దీని ఫలితంగా ఆ రాక్షసుడు తండ్రికి నరకం నుంచి మోక్షం పొంది స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.
అందువల్ల ఏకాదశిని మోక్షదైకాదశి అని పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
అంతేకాకుండా స్వామివారి ఉత్తర ద్వారాన్ని కూడా తెరచి ఆ ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

ఈ ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరుగుతుంది.ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం స్నానం ఆచరించి ఆ నారాయణుడి ఎంతో ప్రీతికరమైన తులసి దళాల మాలలతో తప్పకుండా పూజ చేయటం వల్ల ఆ హరి అనుగ్రహం కలుగుతుంది.ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచిక కాబట్టి, ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించాలని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.
అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పగలంతా ఉపవాస దీక్షలో ఉండి, కేవలం తులసి తీర్థం తీసుకుంటూ ఆ శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.