అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నిత్యామీనన్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లు నటిస్తుండగా అందులో ఒక హీరోయిన్‌గా ఈ అమ్మడు కనిపించనుంది.
ఇక ఈమెకు మరో మెగా మూవీలో కూడా అవకాశం దక్కిందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా ఇదే నెలలో ప్రారంభం కాబోతుంది.
ఆ సినిమాలోనే ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.
నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో నిత్యామీనన్ అయితే బెస్ట్ అని దర్శకుడు శ్రీనువైట్లకు పలువురు సలహా ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిత్యామీనన్ ఇప్పటికే ‘రుద్రమదేవి’ సినిమాలో నటించింది.ఆ సినిమా వేసవిలో విడుదల కాబోతుంది.
ఇక ఈమె తెలుగుతో పాటు తమిళ మరియు మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది.తెలుగులో మాత్రం ఈమెకు మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రావడం లేదు.
వచ్చినా కూడా అవి చిన్న చితక సినిమాలు అవ్వడంతో వాటికి నో చెబుతోంది.ఈ రెండు మెగా మూవీల తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.