సాధారణంగా కొందరికి రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టదు.కంటి నిండా నిద్ర లేకపోతే ఉదయానికి చాలా నీరసంగా మారిపోతుంటారు.
పైగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలం నిద్రలోనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.నిద్ర సరిపడా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టి ముట్టి ముప్ప తిప్పలు పెడుతుంటాయి.
అందుకే చాలా మంది నిద్ర పట్టడం కోసం మందులు వాడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను రోజు నైట్ తీసుకుంటే చక్కటి నిద్ర పట్టడమే కాదు బరువు కూడా తగ్గుతారు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు అంగుళాల దాల్చిన చెక్క వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్ గా సేవించాలి.
నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక అందులో ఉండే ప్రత్యేక సుగుణాలు ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్రను అందిస్తాయి.అలాగే మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలు కరిగే వేగాన్ని రెట్టింపు చేస్తాయి.దాంతో శరీర బరువు అదుపులోకి వస్తుంది.అంతేకాదు ప్రస్తుత వింటర్ సీజన్లో ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.
చలిని తట్టుకునే సామర్థ్యం సైతం లభిస్తుంది.