కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ దర్శకత్వంలో పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం శంకరాభరణం.జేవీ సోమయాజులు ప్రధాన పాత్రలో 13.5 లక్షల బడ్జెట్తో ఈ చిత్రాన్ని విశ్వనాథ్ 60 రోజులలో చిత్రీకరణ పూర్తి చేసి ఫిబ్రవరి 2 1980వ సంవత్సరంలో విడుదల చేశారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషలలో విడుదలై ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమా విడుదలైన అనంతరం ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలా అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన శంకరాభరణం సినిమా తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది.
ప్రస్తుతం కోవాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ చలనచిత్ర కార్యక్రమాలలో భాగంగా శంకరాభరణం సినిమా రిస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఎంపికైంది.నేషనల్ ఫిలిం అచీవ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలో ఎన్నో గొప్ప చిత్రాలను డిజిటలైజ్డ్ చేసి భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా తెలుగులో ఆల్ టైం క్లాసికల్ హిట్గా నిలిచిన సినిమా శంకరాభరణం చిత్రాన్ని ఎంపిక చేశారు.
అదేవిధంగా ఈ 53వ అంతర్జాతీయ చలనచిత్ర వారోత్సవాలలో భాగంగా కొన్ని చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది ఈ క్రమంలోనే శంకరాభరణం చిత్రాన్ని కూడా ఈ చలనచిత్ర వారోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శింప చేయనున్నారు.ఈ సినిమా ప్రదర్శనకు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు.