ఆడవారు అందరూ ధరింపదగిన రత్నాలు ఏవి ఉన్నాయి?

ప్రస్తుత కాలంలో చాలా మంది రంగు రాళ్లను స్టైల్ కోసం వాడుతున్నారు.పెట్టుకున్న వాల్లే రెండు మూడు ధరిస్తూ కనిపిస్తున్నారు.

 What Are The Gems That All Woman Can Wear , Devotional, Rangu Rallu, Rathnalu, ,-TeluguStop.com

అయితే ఈ సంప్రదాయ పురాతన కాలం నుంచే ఉంది.పూర్వం ఆడ వాళ్లు ముత్యం, పగడం, నల్ల పూసలు, రవ్వలు, (వజ్రాలు) సౌభాగ్య ప్రదము అని తప్పని సరిగా ధరించాలి అని పెద్దలు చెబుతుండేవారు.

ఉన్నతమైన వసు ధారణ ప్రభావంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.వజ్రపు ముక్కు పుడక, వజ్రపు కర్ణ ఆభరణములు, అలంకరణ విషయములో ప్రత్యేకతను పొంది ఉండేవి.

అలాగే పగడాలు, ముత్యాలు, సౌభాగ్య హేతువులు అందువలన వీటి ధారణ విషయంగా జాతకం చూసేవారు కాదు.

అయితే ఇప్పటికీ ప్రాచీన సాంప్రదాయం నడిపే కుటుంబాలలో ఆడవారి మంగళ సూత్రాలలో, నల్లపూస, పగడం, ముత్యం వేసి తాడు కట్టుకునే అలవాటు మనం చూడవచ్చు.

అంతే కాదు చాలా మంది నల్ల పూసల దండను వేస్కుంటూ ఉంటారు. స్టైల్ కోసం మంగళ సూత్రాలు పక్కన పెట్టి కేవలం నల్ల పూసల దండలను, ఇతర చైన్ లను కూడా వాడే వళ్లు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటారు.

నేటి సమాజంలో నవ రత్నాలు పిచ్చి ఎక్కువ అయి సమాజంలో ఆడవారికి పగడం, ముఖ్యం, వజ్రం, ద్వారా వచ్చే సౌభాగ్య వృద్ధి గూర్చి తెలిపే వారు కరువయ్యారు.కానీ వజ్రాలు, పగడాల వల్ల కల్గే లాభాలు తెల్సిన వారు మాత్రం వాటిని ఇప్పటికీ వాడుతున్నారు.

చేతి ఉంగరంలోనో.మెడలో ఉండే చైన్ లోనో వాటిని ఉంచుకొని అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube