మనదేశంలో చాలామంది హిందువులు నమ్మే జ్యోతిష శాస్త్రం( Astrology ) ప్రకారం సూర్యుడు బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు.మరో నాలుగు రోజుల్లో అంటే జూలై 16వ తేదీ నుంచి సూర్య భగవానుడు అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
కర్కాటక రాశి( Karkataka rasi )కి అధిపతి చంద్రుడిని భావిస్తారు.కర్కాటక రాశిలో వీరిద్దరూ కలయిక కారణంగా ఈ శుభకరమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
వి అయితే ఈ రాజయోగం అద్భుత ఫలితాలను అందిస్తుంది అని పండితులు చెబుతున్నారు.

కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపించినా ఎక్కువ శాతం ఈ రాశులకు శుభ ప్రయోజనాలు కలుగుతాయి.ఇంకా చెప్పాలంటే బుధాదిత్య రాజయోగం మేష రాశి( Mesha Rasi ) వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.ఈ రాశి వారి కోరికలన్నీ త్వరలో నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.వీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.
అలాగే మిథునరాశి( Mithuna Rasi )కి ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉంది.ముఖ్యంగా భూమి, వాహనం లేదా ఏదైనా విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు.అలాగే వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది.
వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే బుధాదిత్య రాజయోగం కన్య రాశి వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారి కలలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది.వీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు.
అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది.అంతేకాకుండా ఈ రాజయోగం తులా రాశి( Libra ) వారికి ఊహించని ధనం లాభాన్ని కలిగిస్తుంది.
ఉద్యోగులకు మంచి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.







