మీ జుట్టు పొడుగ్గా పెర‌గాలంటే వారానికి ఒక్క‌సారైనా ఇలా చేయండి!

జుట్టు పొడుగ్గా పెర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ గ్రోత్ అగిపోతుంటుంది.

 Do This At Least Once A Week To Make Your Hair Grow Longer! Hair Growth, Latest-TeluguStop.com

దాంతో పొడ‌వాటి జుట్టు క‌ల క‌ల‌గానే మిగిలిపోతుంది.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని వారానికి ఒక్క‌సారైనా ట్రై చేస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక కీర దోస‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌టి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న కీర దోస స్లైసెస్‌, మూడు రెబ్బ‌ల క‌రివేపాకు, ప‌ది తుల‌సి ఆకులు, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, అర క‌ప్పు వాట‌ర్ వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక‌సారి కీర దోస‌తో ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతుంది.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గు ముకం ప‌డుతుంది.మ‌రియు డ్రై హెయిర్ స‌మ‌స్య నుండి కూడా విముక్తి ల‌భిస్తుంది.

ఇన్ని అద్భుత ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టి.త‌ప్ప‌కుండా ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube