పవిత్రమైన కార్తీక మాసంలో ఈ ఒక్క రోజు.. ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యాఫలం..?

మన భారత దేశంలోని ప్రజలు ప్రతి చిన్న పండుగను కూడా తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అలాగే ఏ పండుగనైనా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు.

 Get Good Deeds By Doing Pooja Like This On Karthika Masam Details, Good Deeds ,-TeluguStop.com

ప్రస్తుతం పవిత్రమైన కార్తీక మాసన్నీ( Karthika Masam ) మన దేశంలోని చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు.శ్రీమహా విష్ణువుకు, శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం మొదలవడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

అంతేకాకుండా కార్తీక మాసంలో ఇలా చేస్తే కొన్ని పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజున దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

అలాగే శివ విష్ణువు దేవాలయాలలో భక్తులు దీపాలు వెలిగిస్తారు.

Telugu Bhakteshwara, Bhakti, Deeparadhana, Devotional, Deeds, Jwala Thoranam, Ka

కార్తీక పౌర్ణమి రోజున మహిళలు తమ సౌభాగ్యం కోసం భక్తేశ్వర ( Bhakteshwara ) అనే వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే మహిళలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.కార్తీక పౌర్ణమి రోజు చేసే నది స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నిటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో సూర్యోదయానికి ముందే తల స్నానం చేయడం వల్ల ఈ వాతావరణం పరంగా మనకు ఎంతో ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఈ పౌర్ణమి రోజు చేసే ప్రతి పూజకు కూడా ఎంతో పుణ్యా ఫలితం ఉంటుంది.

Telugu Bhakteshwara, Bhakti, Deeparadhana, Devotional, Deeds, Jwala Thoranam, Ka

అలాగే పౌర్ణమి రోజున శివాలయాలలో( Shivalayam ) జరిపే జ్వాలా తోరణానికి( Jwala Thoranam ) ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు పూజలు చేస్తారు.వాటిలో వృషవ్రతం, మహీఫల వ్రతం, నానా ఫల వ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం,సత్యనారాయణ వ్రతం కృత్తిక వ్రతం లాంటివి ముఖ్యమైనవి అని పండితులు చెబుతున్నారు.వీటితో పాటు లక్ష బిల్వార్చన, లక్ష వత్తులు, లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు.

ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన ప్రత్యేక పూజలు దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ నిర్వహణ అని నిపుణులు చెబుతున్నారు.పౌర్ణమి రోజున ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube