సాధారణంగా పుణ్య క్షేత్రాలన్నీ కూడా నదీ తీరాలవెంటే ఉంటాయి.అందువలన ఆయా పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి నదుల్లో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు.
ఇక పుష్కర సమయంలోను …కార్తీక మాసంలోను … విశేషమైన కొన్ని పుణ్య దినాల్లోను నదీ స్నానాలు చేయటం తప్పనిసరి అయిందని చెప్పవచ్చు.
గంగ … కృష్ణ … యమున … గోదావరి … నర్మద … తుంగభద్ర … గౌతమీ నదీ తీరాల వెంట ఎన్నో పుణ్య క్షేత్రాలు … మరెన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి.‘గంగానది’లో స్నానం చేయడం వలన పాపాలన్నీ పోతాయని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది.‘గోదావరి నది’లో ఒకసారి స్నానం చేయడం వలన వంద సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెపుతున్నాయి చెపుతున్నాయి.
‘కృష్ణా నది’ స్నానం శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.‘తుంగభద్ర నది’లో స్నానం చేసినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.ఒక్కసారి ‘గౌతమీ నది’ స్నానం చేయడం వలన అనేక పుణ్య ఫలాలు లభిస్తాయి.ఇక ‘నర్మదా నది’లో స్నానం చేసి అనుకున్నవి దానంచేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
ఇక పుష్కర కాలంలో ఆయా నదుల్లో స్నానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.నదీ స్నానాల ఫలితంగా పుణ్యాన్ని ఆర్జించిన వారంతా సువర్ణముఖీ నదీ తీరంలో జన్మిస్తారనేది పురాణాల్లో ఉన్నది.