చీటికిమాటికి మూత్రం వస్తోందా? అయితే ఇవిగో చిట్కాలు

మూత్రం ఒంట్లోంచి ఎందుకు బయటకివస్తుందో మనకి తెలుసు.ఒంట్లో ఉన్న మలినాల్ని ఇది బయటకి తీస్తుంది.

 You Have To Pee Repeatedly ? Try These Remedies-TeluguStop.com

కాబట్టి మనుషలు మూత్ర విసర్జన చేయాలి.అందుకే బ్లాడర్ నిండగానే మనం ఆపుకోలేని విధంగా మన బ్లాడర్ నిర్మాణం జరిగింది.

మూత్రాన్ని ఆపుకోవడం మంచిది కాదు, బ్లాడర్ ఫుల్ అయినప్పుడు విసర్జించాలి.కాని అదేపనిగా మూత్రం వస్తే ఎలా? రోజుకి 5-8 సార్లు అయితే ఓకే కాని, అంతకుమించి మూత్రం వస్తోందంటే అది ఆరోగ్యకరమైన స్థితి కాదు.ట్రాక్ట్ ఇంఫెక్షన్స్, ఓవర్ యాక్టీవ్ బ్లాడర్, షుగర్ వ్యాధిలాంటి సమస్యలు ఉండొచ్చు.మరి అతిమూత్రం సమస్య నుంచి బయటపడి, నలుగురిలో ఇబ్బందిపడకూడదు అంటే ఏం చేయాలివ?

* పాలకూర గొప్ప న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఆహారం.దీన్ని ఉడకబెట్టి తింటే ఇది బ్లాడర్ కి ఎంతో మేలు చేస్తుంది.మాటిమాటికి మూత్రం రాకుండా యూరీన్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

ఓ లిమిట్ గా, రెగ్యులర్ గా తీసుకోండి, మీ సమస్యతో మీరే సొంతంగా పోరాడవచ్చు.

* టున్నుల కొద్ది యాంటిఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది దానిమ్మ.

దానిమ్మ ఇత్తులు మాత్రమే కాదు, దాని చర్మం కూడా లాభదాయకమే.దానిమ్మ చర్మాన్ని ఓ పేస్టులా తయారుచేసి, నీటిలో వేసి సేవిస్తూ ఉండండి.

కొన్ని రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి.

* ఉలువలు తెలుసుగా? ఉలువల చారు ఇష్టంగా తింటాం కదా.వీటని బెల్లంతో కలిపి తింటే నిజంగానే అతిమూత్రం సమస్య తగ్గుతుంది.

* గుమ్మడికాయ ఇత్తులని ఎప్పడైనా గమనించారా? ఇందులో ఫ్యాటి ఆసిడ్స్ బాగా ఉంటాయి.ఇవి మీ బ్లాడర్ కి అవసరమైన ఫుడ్ ఐటమ్స్‌.ఇది బ్లాడర్ పనితనాన్ని బ్యాలెన్స్ చేసి అతిమూత్రాన్ని ఆపుతుంది.

* మెంతి గింజలు, అల్లంని బాగా దంచి, పౌడర్ లాగా చేసుకోండి.ఈ మిశ్రమంని అలాగే తీసుకోవడం చాలా కష్టం అందుకే కొంచెం తేనే కలుపుకోని రెగ్యులర్ గా తీసుకోండి.

ఊహించని మార్పు కనబడుతుంది.

* ఇంకా చెప్పాలంటే బెకింగ్ సోడాని నీళ్ళలో కలుపుకోని తాగడం, గోరువెచ్చని నీటిలో వైట్ వెనిగర్ కలుపుకోని తాగడం కూడా ఈ సమస్యపై పనిచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube