ఆచార్య నుండి త్రిష అందుకే తప్పుకుందా.. డైరెక్టరే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కువగా వినపడుతున్న మాటలు మెగా మూవీ ఆచార్య గురించే … ముందుగా ఏర్పడ్డ అంచనాలు వేరే సినిమా రిలీజ్ అయ్యాక వాస్తవాలు వేరే కావడంతో ప్రేక్షకులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.అసలు మెగా హీరోస్ కలిసి చేస్తున్న మూవీ అంటే ఏ రేంజ్ లో ఉండాలి.

 Why Trisha Dropped From Acharya Movie , Trisha , Acharya Movie , Tollywood Indu-TeluguStop.com

అలాంటిది ఒక డెబ్యూ హీరో సినిమా స్థాయిలో కూడా మూవీ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం సర్వత్రా విమర్శలే ఎదురవుతున్నాయి.ఒకసారి దీనికి కారణమంతా దర్శకుడు కొరటాలే అని, ఇద్దరు మెగా స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేక కన్ఫ్యుజ్ అయ్యి ఇలా వంకరటింకరగా సినిమా తీసి పారేశారని మెగా అభిమానులు డైరెక్టర్ కొరటాలపై విరుచుకుపడ్డారు.

ఆ తరవాత మెగా హీరోలు కథ విషయంలో జోక్యం చేసుకోవడం వలనే కొరటాల అనుకున్న కథ అనుకున్నట్లు స్క్రీన్ ప్లే చేయలేకపోయారు అని వినిపించింది.

ఇంకాసేపు హీరోయిన్ పూజ హెగ్డే వలనే మూవీ పోయిందని.

ఇంకొందరు మెగా స్టార్ కి పక్కన హీరోయిన్ లేకపోవడం వలనే ఇలా సీన్ రివర్స్ అయ్యిందని ఇలా చాలా మాటలే వినిపించాయి.ఇపుడు ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో చిరుకి హీరోయిన్ గా ఫస్ట్ సెలెక్ట్ చేసింది త్రిషను అయితే ఆమె ఎందుకు తప్పుకుంది అన్న అంశం ఇపుడు వైరల్ గా మారింది.ఈ చిత్రంలో అసలు త్రిష, చిరు పక్కన నటించాల్సింది అని అయితే కథలో మార్పులు చేర్పులు కంటిన్యూస్ గా చోటు చేసుకుంటుండడం తోనే ఆమె డ్రాప్ అయ్యారని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ కోసం వెతకాల్సి వస్తోంది.ఎందుకంటే యంగ్ హీరోయిన్లు చిరు పక్కన అంటే కష్టమే అందుకే సీనియర్ హీరోయిన్లు అందు లోనూ క్రేజీ హీరోయిన్ లను వెతుక్కోవాల్సిన పరిస్థితి.

Telugu Acharya, Chiranjeevi, Kajal, Koratala Siva, Heroes, Pooja Hegde, Senior,

అయితే ఆచార్య మూవీ అనుకున్నప్పుడు కూడా చిరు కోసం హీరోయిన్ల వేట మొదలైయ్యింది.త్రిష కు లాక్ అయ్యారు.అయితే ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల కూడా ఒకసారి అన్నారు.అయితే తనకు చెప్పిన స్టోరీ ఒకటి తీస్తున్న సన్నివేశాలు మరొకటి కావడంతో త్రిషకు డౌట్ వచ్చి సైలెంట్ గా క్రియేటివ్ డిఫరెన్స్ అని సైడ్ అయిపోయారు.

ఆ తరవాత అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కాజల్ ను ఒప్పించి తీసుకొచ్చారు శివ.ఆమె ది, చిరు ది కలిపి ఒక సాంగ్ , కొన్ని సన్నివేశాలు కూడా పూర్తి చేశారు.

అయితే మళ్ళీ కథలో మార్పులు జరగడంతో కాజల్ ని సినిమా నుండి తొలగించారు దర్శకుడు కొరటాల.ఈ విషయం చివరి నిముషంలో దర్శకుడు కొరటాల శివ చెప్పే వరకు చాలా మందికి అస్సలు తెలియలేదు.

అయితే చిరు పక్కన హీరోయిన్ ఉంటే సినిమా మరీ ఇంత తారుమారు అయ్యేది కాదని అసలు శివ మొదట అనుకున్న కథను అనుకున్నట్లు అప్లై చేసున్నా సినిమా వేరే లెవల్ లో ఉండేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube