Ginger Chia Water : జింజర్ చియా వాటర్.. రోజుకు ఒక గ్లాస్ తాగారంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం!

సాధారణంగా కొన్ని కొన్ని పానీయాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి.అనేక జబ్బుల నుంచి రక్షిస్తాయి.

 Amazing Health Benefits Of Drinking Ginger Chia Water-TeluguStop.com

జింజర్ చియా వాటర్( Ginger Chia Water ) కూడా ఆ కోవకే చెందుతుంది.రోజుకు ఒక గ్లాసు చొప్పున నిత్యం జింజర్ చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అర అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుము కావాలి.

ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని( glass of warm water ) తీసుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు వదిలేయాలి.

ఆపై కొద్దిగా తేనె కలిపితే మన జింజర్ చియా వాటర్ రెడీ అవుతుంది.రోజువారీ ఆహారంలో ఈ పానీయాన్ని చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Telugu Benefitsginger, Chia Seeds, Ginger, Gingerchia, Tips, Latest-Telugu Healt

జింజర్ చియా వాటర్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్, విటమిన్లు మరియు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.జింజర్ చియా వాటర్ అనేది బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అల్లం యొక్క థర్మోజెనిక్( Thermogenic ) ప్రభావాలు మరియు చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.కేలరీలను బర్నింగ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఆకలిని నియంత్రిస్తాయి.బొడ్డు కొవ్వును సైతం సమర్థవంతంగా కరిగిస్తాయి.

Telugu Benefitsginger, Chia Seeds, Ginger, Gingerchia, Tips, Latest-Telugu Healt

అలాగే అల్లం మరియు చియా సీడ్స్( Chia seeds ) రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.మధుమేహం ఉన్నవారికి ఈ పానీయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.జింజర్ చియా వాటర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.అందువల్ల ఈ పానీయం జీర్ణక్రియ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

అంతేకాకుండా ఈ వాటర్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.ఆర్థరైటిస్, గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.

మరియు సీజనల్ రోగాల నుంచి సైతం కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube