Ginger Chia Water : జింజర్ చియా వాటర్.. రోజుకు ఒక గ్లాస్ తాగారంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం!
TeluguStop.com
సాధారణంగా కొన్ని కొన్ని పానీయాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి.అనేక జబ్బుల నుంచి రక్షిస్తాయి.
జింజర్ చియా వాటర్( Ginger Chia Water ) కూడా ఆ కోవకే చెందుతుంది.
రోజుకు ఒక గ్లాసు చొప్పున నిత్యం జింజర్ చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అర అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుము కావాలి.
ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని( Glass Of Warm Water ) తీసుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై కొద్దిగా తేనె కలిపితే మన జింజర్ చియా వాటర్ రెడీ అవుతుంది.
రోజువారీ ఆహారంలో ఈ పానీయాన్ని చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. """/" /
జింజర్ చియా వాటర్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్లు మరియు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
జింజర్ చియా వాటర్ అనేది బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అల్లం యొక్క థర్మోజెనిక్( Thermogenic ) ప్రభావాలు మరియు చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కేలరీలను బర్నింగ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.ఆకలిని నియంత్రిస్తాయి.
బొడ్డు కొవ్వును సైతం సమర్థవంతంగా కరిగిస్తాయి. """/" /
అలాగే అల్లం మరియు చియా సీడ్స్( Chia Seeds ) రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
మధుమేహం ఉన్నవారికి ఈ పానీయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.జింజర్ చియా వాటర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
అందువల్ల ఈ పానీయం జీర్ణక్రియ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.
మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది.అంతేకాకుండా ఈ వాటర్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆర్థరైటిస్, గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.మరియు సీజనల్ రోగాల నుంచి సైతం కాపాడుతుంది.
మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?