లాలాజల పరీక్షతో అనేక వ్యాధులను గుర్తింపు.. అది ఏవిధంగానంటే..

లాలాజల నమూనాతో డజన్ల కొద్దీ వ్యాధులను గుర్తించవచ్చు.మధుమేహం నుంచి క్యాన్సర్ వరకు అనేక వ్యాధులను గుర్తించ‌వ‌చ్చ‌ని దీనిపై పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు .

 Saliva Test Can Detect Many Diseases Whatever It Is, Uric Acid , Saliva Test , H-TeluguStop.com

ఈ పరీక్ష పద్ధతి వ్యాధులను గుర్తించడంలో పెద్ద మార్పును తీసుకు రానుంది.మానవ లాలాజలంలో 700 సూక్ష్మజీవులు, యూరిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంతేకాకుండా ప‌లు వ్యాధులను సూచించే అనేక రసాయనాలు ఇందులో కనిపిస్తాయి.దీనిని ప‌రీక్షించ‌డం కూడా చాలా సుల‌భం.

లాలాజల పరీక్ష వ్యాధులను ఎలా గుర్తిస్తుంది? దాని నుండి ఏఏ వ్యాధులు తెలుసుకోవచ్చు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.డెయిల్ మెయిల్ నివేదిక ప్రకారం లాలాజలంలో ఉండే యూరిక్ యాసిడ్ మరియు వ్యాధుల మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ పరిశోధనను సమీక్షించిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ దత్తా మేఘ్.శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం చాలా విషయాలకు సంకేతమని చెప్పారు.

దాని పెరుగుదల కారణంగా, రక్తపోటు కూడా పెరుగుతుంది.అంతే కాకుండా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్, బ్లడ్ షుగర్, మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్లను కూడా గుర్తించ వచ్చ‌న్నారు.

యూరిక్ యాసిడ్ అంటే.ఇది రక్తంలో కనిపించే రసాయనం.

ప్యూరిన్ చేసిన ఆహారాల జీర్ణక్రియ ప్రక్రియలో ఇది ఉత్పత్తి అవుతుంది.యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగి పోతుంది, మిగిలిన‌ది మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది.

కానీ శరీరంలో ప్యూరిన్ పరిమాణం ఒక నిర్దిష్ట పరిమాణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు మరియు మూత్రపిండాలు కూడా దానిని ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు, అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది.దీని కారణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

Saliva Test Can Detect Serious Illness Saliva Test

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube