సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీమణులు( actresses ) తమకు ఇష్టం లేకపోయినా కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుంది.కథ డిమాండ్ చేస్తే, డైరెక్టర్ మొండి పట్టుపడితే నచ్చకపోయినా కొన్ని సీన్లు చేయక తప్పదు.
మేం చేయము అంటే సినిమా మొత్తం పాడైపోతుంది.మళ్లీ చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు నటించక తప్పదు.అలా కొంతమంది హీరోయిన్లు తమకు ఏమాత్రం నచ్చకపోయినా కొన్ని సీన్లు చేశారు.అవేవో తెలుసుకుందాం.
• సదా:
( Sada )
రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ జయం (2002)లో సదా హీరోయిన్‌గా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీలో విలన్ గోపీచంద్ సదా చెంపను నాలుకతో నాకే ఒక సన్నివేశం ఉంటుంది.ఈ సన్నివేశం చేయడానికి సదా అసలు ఒప్పుకోలేదు కానీ డైరెక్టర్ తేజ ( Director Teja )మాత్రం పట్టుబట్టి మరీ ఆమె చేత ఆ సన్నివేశం చేయించాడు.
పైగా ఇది ఆమెకు ఫస్ట్ సినిమా.ఇందులోనే బెట్టు చేస్తే చివరికి అవకాశాలు ఏవీ రాకుండా ఇండస్ట్రీ నుంచి పోవాల్సి వస్తుందని ఆమె భయపడింది.గోపీచంద్ సదా చెంపను ఎలా నాకాడో తెలియదు కానీ ఈ సీన్ అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.

• పాయల్ రాజ్‌పుత్
( Payal Rajputh )
ఆర్ఎక్స్ 100 మూవీ ( RX 100 movie )హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కి జంటగా నటించింది.ఆమె ఈ మూవీలో తన వయసు కంటే ఎక్కువ వయసున్న మహిళ లాగా కనిపించింది.నిజానికి అందులో నటించడం ఆమెకి ఇష్టం లేదు కానీ మళ్ళీ స్టార్ హీరో వెంకటేష్ తో నటించే అవకాశం వస్తుందో రాదో అని ఓకే చెప్పింది.
ఆమె చేసిన మంచి క్యారెక్టర్ ఇదే అని చెప్పుకోవచ్చు.

• రాశి
( Rashi )
నిజం సినిమాలో నటి రాశి గోపీచంద్ తో కలిసి చాలా రొమాంటిక్ సన్నివేశాలు నటించింది.ఆమె క్యారెక్టర్ కి నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి.అయితే సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని తెలియదు.
సినిమా మధ్యలో వచ్చేసరికి ఇలాంటివి చేయాలని చెప్పడంతో ఆమె షాక్ అయింది.మూవీ నుంచి మధ్యలోనే తప్పుకుంటే అందరికీ ఇబ్బంది అని ఆమె నచ్చకపోయినా ఆ సన్నివేశాలు చేసింది.
నిజం సినిమా ఐదారు కోట్ల లాభం తో హిట్ అయిందని డైరెక్టర్ ఒక సందర్భంలో తెలిపారు.ఈ సినిమా తర్వాత రాశికి మంచి పేరు వచ్చింది.