ఇప్పుడు సినిమా అంటే అది కేవలం సౌత్ దర్శకులు( South Directors ) మాత్రమే.ఎందుకంటే ఒకప్పుడు ముంబై మాత్రమే పాన్ ఇండియా సినిమాలకు అడ్డాగా ఉండేది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.సౌత్ ఇండస్ట్రీలోని దర్శకులు తీస్తేనే అవి సరిగా పండుతాయి అని సౌత్ తో పాటు నార్త్ అభిమానులు కూడా అనుకుంటున్నారు.
ఎందుకో తెలియదు కానీ సౌత్ దర్శకులలో జనాలకు కావలసిన ఎమోషన్ ఉంటుంది, మాస్ బాగా తీస్తారు.
అలాగే ప్యాన్ ఇండియా రీచ్ అవ్వాలంటే కేవలం అది మన దర్శకులతోనే అవుతుంది అని ప్రతి ఒక్కరు అంటున్న విషయం.
అందువల్ల సౌత్ నుంచి వచ్చే దర్శకులకు డిమాండ్ పెరిగింది.ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ దర్శకుల హవా బాగా కనిపిస్తోంది.మరి హిందీ సినిమాలు డైరెక్షన్ చేస్తున్న ఆ సౌత్ ఇండస్ట్రీ దర్శకులు ఎవరు ? ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అట్లీ

జవాన్( Jawan ) సినిమాతో అట్లీ( Atlee ) బాలీవుడ్ కి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ లోనే వరుస ప్రాజెక్టులు తీసే పనిలో ఉన్నాడు.షారుక్ ఖాన్ కి 1000 కోట్లు వసూలు సాధించి పెట్టిన అట్లీ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం వరుణ్ ధావన్ తో( Varun Dhawan ) తేరి సినిమా రీమేక్ చేస్తున్నాడు అట్లీ.
విష్ణు వర్ధన్

పంజా సినిమా దర్శకుడైన విష్ణు వర్ధన్( Vishnu Vardhan ) ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో( Salman Khan ) ఒక సినిమా తీస్తున్నారు.నిజానికి విష్ణువర్ధన్ తెలుగులో తీసిన పవన్ కళ్యాణ్ పంజా ఫ్లాప్ అయినప్పటికీ ఆయన తీసిన తమిళ సినిమాలన్నీ విజయం సాధించాయి.అందువల్లే సౌత్ దర్శకుడైన విష్ణువర్ధన్ పై సల్మాన్ ఖాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.
సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి( Sandeep Reddy Vanga ) పేరు సంచలనగా మారిపోయింది.ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం రన్వీర్ సింగ్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా ఆనిమల్( Animal Movie ) అనే చిత్రాన్ని డిసెంబరు 1 న విడుదల చేస్తున్నారు.
వీళ్లు మాత్రమే కాదు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ పేరు చెబితే నార్త్ హీరోలు హాట్ కేక్ గా చూస్తున్నారు.
ఇక అక్షయ్ కుమార్ లాంటి హీరో అయితే కథ కూడా వినకుండా సౌత్ దర్శకులను సినిమాలు చేయమని అడుగుతున్నాడట.ప్రస్తుతం దాదాపు 7 సినిమాల్లో నటిస్తున్నటువంటి అక్షయ్ కుమార్ సినిమాలు కొన్ని సౌత్ దర్శకులు కూడా డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.
సూర్య సూరారై పొట్రు, సింగం సినిమాలను ప్రస్తుతం అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు
.