ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.తమిళ్ సినిమా ఇండస్ట్రీలో(Tamil film industry) స్టార్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ధనుష్(Dhanush) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఈ హీరోతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయన మాత్రం సెలెక్టెడ్ గా కొంతమంది దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఇక అందులో వెంకీ అట్లూరీ(Venky Atluri) కూడా ఉండటం విశేషం…

ప్రస్తుతం ఆయన అమరన్ (Amaran)సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్న రాజకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరితో మరొక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.అలాగే శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరెక్షన్ లో ‘కుబేర ‘ (kubera)అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి వెంకీ అట్లురి తో కలిసి మరోసారి ఇలాంటి మ్యాజిక్స్ చేయబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వెంకీ అట్లూరి ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఒకవేళ ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తే స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.లేకపోతే మాత్రం మీడియం రేంజ్ డైరెక్టర్ గానే మిగిలి పోవాల్సిన ప్రమాదమైతే ఉంది…ఇక ధనుష్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం ప్రతి డైరెక్టర్ చెప్పే కథలను వింటూ ఆయనకి కొత్తగా అనిపించిన కథలను చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది…
.