మరోసారి అలా కనిపించబోతున్న రామ్ చరణ్.. సుకుమార్ మ్యాజిక్ చేయడం పక్కా!

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్( Sukumar ) గురించి మనందరికీ తెలిసిందే.సుకుమార్ ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Rc 17 Movie Ram Charan Doing Dual Role, Rc 17 Movie, Tollywood, Ram Charan, Dual-TeluguStop.com

మొన్నటి వరకు సుకుమార్ పుష్ప సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గడిపారు.కొన్ని సంవత్సరాలు ఈ సినిమా కోసమే సమయాన్ని వెచ్చించారు సుకుమార్.

ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవడంతో ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యారు.ఇక పుష్ప 3 సినిమా ( Pushpa 3 movie )ఇప్పట్లో ఉండదని అల్లు అర్జున్ చెప్పేశారు.

దీంతో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్టు పని మొదలుపెట్టనున్నాడు.గతంలో RC17 ప్రాజెక్టుగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telugu Dual Role, Ram Charan, Rc, Rcram, Tollywood-Movie

అయితే ఇప్పటికే సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం వచ్చి భారీ విజయం సాధించింది.దీంతో వీరి కాంబోపై మరోసారి భారీగా అంచనాలు నెల కొన్నాయి.ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 మూవీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌ గా కంప్లీట్‌ చేసి దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది ఈ సినిమా.

బుచ్చిబాబు సినిమా పూర్తి అవ్వగానే వెంటనే సుకుమార్ సినిమాలో జాయిన్ కానున్నారు రామ్ చరణ్.పుష్ప 2 తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న సుకుమార్ ఇప్పుడు రాంచరణ్ తో తెరకెక్కించబోయే సినిమా స్క్రిప్ట్ రెడీ చేయడంలో బిజీగా ఉన్నారట.

Telugu Dual Role, Ram Charan, Rc, Rcram, Tollywood-Movie

స్ర్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని, త్వరలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా మొదలు పెడతారని సుక్కు సన్నిహితులు అంటున్నారు.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు.గతంలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అనౌన్స్ చేస్తూ రెండు గుర్రాలతో ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.అయితే ఆర్సీ 17 పై సోషల్ మీడియాలో అప్పుడే ఒక న్యూస్ వైరల్ అవుతోంది.

v అదేంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇది పక్కా యాక్షన్ మూవీ అంటున్నారు అభిమానులు.సుక్కు చెర్రీ కాంబినేషన్‌లో వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ రంగ‌స్థలం బ్లాక్‌ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు RC17 మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ పిక్చరే అంటున్నారు.

గతంలో సుకుమార్ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube