ప్రతి అమ్మాయికి డేటింగ్(Dating) అంటే ఒక సవాలే.ఏ దేశం అమ్మాయిలైనా, ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా డేటింగ్ కష్టాలు మాత్రం కామన్.
భద్రత గురించిన టెన్షన్లు, ఆడవాళ్లని తక్కువగా చూసే మగాళ్లతో తిప్పలు, కల్చర్‌లు వేరైతే వచ్చే గొడవలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.ఇక మన ఇండియన్ అమ్మాయిలు (Indian girls)వేరే దేశాల్లో ఉంటే, ఈ కష్టాలు డబుల్ అవుతాయి.
2023లో బంబుల్ అనే యాప్ వాళ్లు ఒక సర్వే చేస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.అవి ఏంటంటే, 81% మంది ఇండియన్ అమ్మాయిలు సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నారంట.
అంతేకాదు, 63% మంది డేటింగ్ విషయంలో తమకు నచ్చింది జరగాల్సిందే అంటున్నారట.అయితే మన ఇండియన్ అమ్మాయిలు ఫారిన్ కంట్రీస్‌కి (foreign countries)వెళ్తే పరిస్థితి ఏంటి? వేరే దేశాల అబ్బాయిలతో డేటింగ్ చేయడం అంత ఈజీనా?
ఇదే విషయంపై రెడిట్‌లోని r/AskIndianWomen అనే గ్రూప్‌లో పెద్ద డిస్కషన్ జరిగింది.అమ్మాయిలు వాళ్ల డేటింగ్ స్టోరీలు చెప్పి షాక్ ఇచ్చారు.ఒక్కొక్కరిదీ ఒక్కోలాంటి ఎక్స్‌పీరియన్స్.ఫారిన్ కంట్రీస్‌లో డేటింగ్ అంటే మామూలు విషయం కాదని తేలిపోయింది.
చాలా మంది అమ్మాయిలు వాళ్ల కల్చర్‌ని అర్థం చేసుకునే వాళ్లైతేనే బెటర్ అని చెప్పారు.
కొందరు ఇండియన్ అబ్బాయిలు రిజెక్ట్ చేస్తే చాలు, తెగ ఇబ్బంది పెడతారని, మైండ్‌సెట్ కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు.అందుకే వాళ్లని దూరం పెట్టారంట.
ఇంకొక అమ్మాయి తన 20 ఏళ్లలో వేరే దేశానికి వెళ్లింది.మొదట్లో అక్కడి అబ్బాయిలతో డేటింగ్ చేయాలంటే భయపడింది.
ఎందుకంటే వాళ్లిద్దరి ఆలోచనలు కలవవు ఏమో అని టెన్షన్ పడింది.తను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది, అంతకు ముందు ఎప్పుడూ డేటింగ్ (dating)చేయలేదు.
కానీ తర్వాత తన కొలీగ్‌తో డేటింగ్ చేసి, అతన్నే పెళ్లి చేసుకుంది.ఇప్పుడు వాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అమెరికాలో ఐదేళ్లు ఉన్న ఒక అమ్మాయి అమెరికన్ అబ్బాయిలతో డేటింగ్ చేయడం చాలా ఈజీ అని చెప్పింది.వాళ్లు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారట.ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకుంటారట.కానీ కొంతమంది ఇండియన్ అబ్బాయిలు మాత్రం ఇంటి పనులన్నీ ఆడవాళ్లే చేయాలనే మైండ్‌సెట్‌తో ఉంటారు అని చెప్పింది.అంతేకాదు, ఫారిన్ అబ్బాయిలు డేటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో క్యాజువల్‌గా ఉంటారు, కానీ ఇండియన్ అబ్బాయిలు మాత్రం రెండు మూడు డేట్స్‌లోనే రిలేషన్‌షిప్ అనుకుంటారని చెప్పింది.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, “ఫారిన్ అబ్బాయిలు రిజెక్ట్ (Foreign boys reject)చేస్తే సైలెంట్‌గా ఉంటారు, కానీ ఇండియన్ అబ్బాయిలు మాత్రం ఎందుకు రిజెక్ట్ చేశావో చెప్పమని వెంటపడతారు, మళ్లీ ఆలోచించమని బతిమాలుతారు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకామెకు ఇంకో విచిత్రమైన ప్రాబ్లం వచ్చిందట.తను ఇండియన్ అమ్మాయి కావడంతో వేరే దేశాల అబ్బాయిలు తనతో క్లోజ్‌గా ఉంటే, ఇండియన్ అబ్బాయిలు తట్టుకోలేకపోయేవారట.కావాలనే గొడవలు చేసేవాళ్లట.ఇంకోపక్క తనకి కూడా వెస్ట్రన్ అబ్బాయిలంటే అంత నమ్మకం లేదట.
వాళ్ల కల్చర్ తనకు అర్థం కాదు ఏమో అని, లేదా వాళ్లు శృంగారం విషయంలో మరీ ఎక్కువ ఫ్రీగా ఉంటారేమో అని భయపడేదట.కానీ తను మాత్రం ఈస్ట్ ఏషియన్ అబ్బాయిలకి బాగా అట్రాక్ట్ అయ్యేదంట.
వాళ్లకి ఇండియన్ అమ్మాయిలంటే ఇష్టమే కానీ, పెళ్లి మాత్రం వాళ్ల దేశం అమ్మాయిల్నే చేసుకుంటారని చెప్పింది.

ఇంకో అమ్మాయి ఇద్దరు వైట్ అబ్బాయిలతో డేటింగ్ చేసిందట.కానీ వాళ్లిద్దరూ వాళ్ళ పాత లవ్ స్టోరీలు తెగ చెప్పేవారట.“మా కాలేజ్ గర్ల్‌ఫ్రెండ్ ఇలా చేసింది”, “నేను హైస్కూల్లో ఉన్నప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లాను” అంటూ పాత చింతకాయ పచ్చడిలాగా విసిగించేవారట.ఆ అమ్మాయి అప్పుడు వర్జిన్ కావడంతో, వాళ్లు అలా పదే పదే పాత లవ్ స్టోరీలు(Old love stories) చెప్పడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదట.ఇండియన్ అబ్బాయిలు కూడా ఇలాగే ఉంటారేమో కానీ, అమెరికన్ అబ్బాయిల్లో ఇది కాస్త ఎక్కువగానే చూశాను అని చెప్పింది.
చాలా మంది అమ్మాయిలు వేరే దేశాల వాళ్లతో డేటింగ్ చేయడానికి ఓకే అన్నారు కానీ, కొందరు మాత్రం ఇండియన్ అబ్బాయిలే బెస్ట్ అంటున్నారు.ఒక అమ్మాయి చెప్పిందేంటంటే, “నేను ఎప్పుడూ ఇండియన్ అబ్బాయినే చూస్ చేసుకుంటాను.
ఎందుకంటే మా కల్చర్ ఒక్కటే కదా.నాకు వేరే దేశాల అబ్బాయిలంటే ఏమీ లేదు కానీ, ఇది నా పర్సనల్ ఛాయిస్ అంతే” అని చెప్పింది.

మొత్తానికి ఇండియన్ అమ్మాయిలు వేరే దేశాల్లో డేటింగ్ చేసే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి.కొందరికి కల్చర్ అడ్డంకి వస్తే, మరికొందరు ఫారిన్ అబ్బాయిలే బెటర్ అంటున్నారు.ఫైనల్‌గా ఎవరి ఇష్టం వాళ్లది, ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్లది.