కొన్నిసార్లు నటీనటుల తీరు.దర్శక నిర్మాతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.
సినిమా ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగేందు కోసం లోపలి నుంచి కోపం తన్నుకు వస్తున్నా.బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తారు.
సేమ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు సైతం చిరాకు పుట్టించిందట ఐటమ్ సాంగ్స్ భామ సిల్క్ స్మిత.ఇంతకీ ఆయనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన ఆ సన్నివేశం ఏ సినిమా సమయంలో జరిగింది.? దాని పర్యవసానంగా ఆమెకు కలిగిన నష్టం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై వాహినీ స్టూడియోలో చిరంజీవి కొండవీటి రాజా సినిమా షూటింగ్ జరుగుతుంది.5 లక్షల రూపాయలతో భారీ సెట్ వేశారు.వలయాల ఊయలలో.
పాటను చిరంజీవి, సిల్క్ స్మితపై రూపొందించేందుకు రెడీ అవుతున్నారు.అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాట షూటింగ్ మొదలు పెట్టాడు దర్శకుడు రాఘవేంద్రరావు.
అదే సమయంలో సెట్ లోకి వచ్చింది సిల్క్ స్మిత.అప్పుడే నిద్రలేచి తల కూడా దువ్వుకోకుండా సెట్ కు వచ్చిందామె.
పాటల్లో ఆర్టిస్టులను అందంగా చూపిస్తాడు దర్శకుడు.తన హేర్ స్టైల్ మార్చుకోవాలని స్మితకు చెప్పాడు.
కానీ తన హేర్ స్టైల్ బాగానే ఉందని చెప్పింది.వాదన చేయడం ఇష్టం లేక ఓకే చెప్పాడు దర్శకుడు.
ఆ రోజంతా విచిత్రంగా ప్రవర్తించింది ఆమె.పొగమంచు వాతావరణంలో పాట చేయాలనుకున్నాడు దర్శకుడు.అయితే ఆ పొగ వెళ్లిపోయేలా ఫ్యాన్ వేసుకుని షూటింగ్ కు ఇబ్బంది కలిగించింది.

సిల్క్ స్మిత తీరును నిర్మాత దేవీ వరప్రసాద్ గమనించాడు.ఆమె ప్రవర్తన పట్ల కోపం వచ్చినా.షూటింగ్ కొనసాగాలని సైలెంట్ అయ్యాడు.
మరొసటి రోజు కూడా స్మిత అలాగే ప్రవర్తించింది.అందరు టెక్నిషియన్లు, నటీనటలు దర్శకుడి దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నా.
దర్శకుడే తన దగ్గరికి రావాలని స్మిత పట్టుబట్టింది.ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.
సినిమా నుంచి ఆమెను తప్పించాడు.అప్పటి కొంత పాట షూటింగ్ జరుపుకోగా.
మిగతా సగాన్ని జయమాలిని, అనురాధతో పూర్తి చేశారు.