18 పురాణాలలో మార్కండేయ పురాణం చిన్నది, పద్మ పురాణం పెద్దదని పండితులు చెబుతున్నారు.అలాగే ముందు ఈ తొమ్మిది పురాణాలలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
మత్స్య రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు( Sri Maha Vishnu ) మనవు అనే రాజుకు చెప్పిన ఈ మత్స్యపురాణం.( Matsya Puranam ) ఇందులో కాశీ క్షేత్ర, ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పతనం ధర్మం అంటే ఏంటి ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటో ఇందులో ఉంది.
అలాగే కుర్మావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు చెప్పిన కూర్మపురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, కాశీ ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి ఉందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే పులస్త్య మహర్షి మునులవారు చెప్పిన వామన పురాణంలో( Vamana Puranam ) శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించి వివరణ ఉంది.అలాగే వరాహావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం, ఉపాసన విధానం, ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు, భూమి పై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు వరాహ పురాణంలో( Varaha Puranam ) ఉన్నాయి.అలాగే గరుత్మంతుడి సందేహాలపై శ్రీమహావిష్ణువు చెప్పిన వివరణ గరుడ పురాణం.
( Garuda Puranam ) గరుడుని జన్మ వృత్తాంతం తో పాటు జనన మరణాలు అంటే ఏమిటి, మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు.ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది.
ఇలాంటి విషయాలను ఇందులో ఉన్నాయి.
అలాగే అగ్ని దేవుడు వశిష్ఠునికి చెప్పిన అగ్ని పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలు ఉన్నాయి.అలాగే వాయిదేవుడు చెప్పిన వాయుపురాణంలో పరమేశ్వరుడి మాహాత్మ్యం, భూగోళం, సౌర మండలం గురించి వాయు పురాణంలో ఉంది.అలాగే కాశీఖండం, కేదరఖండం, కుమారిల ఖండం, రేవా ఖండం సహా వివిధ ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందూడే చెప్పాడని పండితులు చెబుతున్నారు.
ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ దేవాలయ విశేషాలతో సహా ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి ఉంది.ఇంకా చెప్పాలంటే లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటు ఖగోళ జ్యోతిష్యం గురించి లింగా పురాణంలో ఉంది.
DEVOTIONAL