ఒక్క ముస్లిం కూడా లేని గ్రామంలో పీర్ల పండుగను ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా..?

మన భారతదేశంలో మతసామరస్యానికి సమకాలీన సంస్కృతికి మరో ఉదాహరణగా ఒక ముస్లిం కూడా నివసించని కర్ణాటకలోని ఒక గ్రామం మహమ్మద్ ప్రవక్త మనవలు ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హసన్ ( Imam Hussain, Imam Hasan )ల అమరవీరుల స్మారకార్థం నిర్వహించే పీర్ల పండుగను ఎన్నో సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు.ఒక్క ముస్లిం కూడా లేని ఈ గ్రామం ఎందుకు పీర్ల పండుగ జరుపుకుంటుంది? అనే విషయం గురించి గ్రామంలోని ప్రజలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.బెళగావి జిల్లా కేంద్రానికి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌందరి తాలూకాలోని హిరేబిదానూర్ గ్రామస్తులు( Herebidanur ) ఒక శతాబ్దానికి పైగా మొహర్రం మాసానికి సంబంధించిన ఆచారాలను పాటిస్తూ ఉన్నారు.

 Do You Know Why Pirla Festival Is Celebrated In A Village Where There Is Not A S-TeluguStop.com

ఇటీవల పునరుద్ధరించిన మసీదును స్థానికులు పకిరేశ్వర్ స్వామి ( Pakireswar Swamy )మసీదుగా నామకరణం కూడా చేశారు.

ఈ గ్రామంలో మసీదును చూసుకునే అక్కడ ప్రార్థనలు నిర్వహించే హిందూ పూజారి ఎల్లప్ప నాయకర్ చెప్పినదాని ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు ముస్లిం సోదరులు మసీదును నిర్మించారు.గుత్తనట్టి గ్రామానికి సమీపంలో మరో భవనాన్ని కూడా నిర్మించారు.

వీరు మరణించిన తర్వాత చుట్టుపక్కల ముస్లింలు ఎవరూ లేకపోవడంతో స్థానికులు ప్రతి ఏడాది మొహర్రం ప్రార్ధన వేడుకలను నిర్వహించడం ఆచారంగా కొనసాగిస్తున్నారు.

Telugu Belagavi, Bhakti, Devotional, Herebidanur, Imam Hasan, Imam Hussain, Pirl

గ్రామస్తులు కర్బల నృత్యాన్ని ప్రదర్శించి గ్రామాన్ని రోప్ ఆర్ట్ తో అలంకరిస్తారు.వారు కూడా అగ్నిపై నడుస్తూ త్యాగానికి చిహ్నమైన తజియాను నెలలో చివరి ఐదు రోజులు గ్రామ వీధుల గుండా తీసుకువెళ్తారు.ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సమీపంలోని మసీదు నుంచి మౌల్విని ఏడు రోజులపాటు మసీదులో ప్రార్థనలు ఆచారాలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఆహ్వానించారు.

మౌల్వికి గ్రామస్తులు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఆయన వసతి కూడా కల్పించి అవసరాలన్నీ వారే తీరుస్తారు.

Telugu Belagavi, Bhakti, Devotional, Herebidanur, Imam Hasan, Imam Hussain, Pirl

ఈ కాలాన్ని మినహాయిస్తే మసీదును చూసుకునేది హిందూ పూజారి ఎల్లప్ప నాయకర్ అనీ గ్రామస్తులు చెబుతున్నారు.మసీదు భవన పునరుద్ధరణకు గత సంవత్సరం శాసనసభ్యులు మహంతేష్ కౌజలగి ( Mahantesh Kaujalagi )8 లక్షల రూపాయలు మంజూరు చేశారు.మహమ్మద్ ప్రవక్త మనవళ్లకు సంతాపం తెలిపే ముహర్రం సంబంధిత ఆచారాలను నిర్వహించే సంప్రదాయం శతాబ్దాల నుంచి ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube