2023లో ఉగాది పండుగ ఎప్పుడు..ఉగాది విశిష్టత గురించి తెలుసా..

హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది( Ugadi).ఈ పండుగ తోనే తెలుగువారి పండుగలు మొదలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు.

 When Is Ugadi Festival In 2023..do You Know About The Uniqueness Of Ugadi, Chait-TeluguStop.com

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను పిలుస్తూ ఉంటారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే పిలుస్తారు.మహారాష్ట్రలో గుడి పడ్వా గా, కేరళలో విషు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో,సిక్కులు వైశాఖి అని, బెంగాలీలో పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు.

ఇక ఉగాది అంటే అర్థం ఉగా అంటే నక్షత్ర గమనం అది అంటే మొదలు అని అర్థం వస్తుంది.

అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి ఉగాది రోజు ఉగాది.జనవరి 1న తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగు ప్రజలు మాత్రం ఉగాది రోజున కొత్త సంవత్సరం గా మొదలు పెడతారు.ఇంకా చెప్పాలంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి (Chaitra masam)రోజు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో ఉంది.

ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని ప్రజలు బలంగా నమ్ముతారు.ప్రభావ నామా ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది.ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు.

ప్రస్తుతం ఏడవ బ్రహ్మ, బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు.శ్రీమహావిష్ణువు(Lord Vishnu) మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని ప్రజలు నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఉగాది పండుగను మార్చి 22వ తేదీన జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube