హిందూమతంలో ప్రకృతిలోని ప్రతి రేణువులోనూ భగవంతుడు ఉంటాడని, అంతేకాకుండా చెట్లు( trees ) మరియు మొక్కలు ప్రకృతిలో ఒక భాగమని ప్రజలందరూ నమ్ముతారు.దశాబ్దాల క్రితమే సనాతన ధర్మంలో చెట్లను, మొక్కలను పూజించేవారు.
చెట్లను, మొక్కలను పూజించడం ద్వారా మనిషి ప్రకృతి పట్ల తన కృతజ్ఞతను చాటుకుంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ( Astrology )ప్రకారం గ్రహాల స్థానం అనుకూలంగా ఉండడానికి చెట్లు మరియు మొక్కలను కూడా పూజిస్తారు.
దాదాపు చాలా ఇళ్ళలో తులసి మొక్కలు( Basil plants ) నాటడం శుభప్రదంగా భావిస్తారు.తులసి మహావిష్ణువు కు కూడా ఎంతో ఇష్టమైన మొక్క.ఆ మొక్క తల్లి లక్ష్మీ రూపంగా పరిగణించబడుతుంది.ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తులసి దీపం వెలిగించి నీరు సమర్పించే ఇళ్లలో విష్ణు సహిత లక్ష్మీమాత ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే ఉసిరి చెట్టును ( amla tree)ఏకాదశి రోజున పూజిస్తే విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే అరటి చెట్టును చాలా మంది ప్రజలు పవిత్రంగా భావిస్తారు.హిందూ మతంలో చేసే ప్రతి పూజలో అరటి చెట్టు ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు.గురువారం రోజు అరటి చెట్టు వేరులో శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించి అరటి చెట్టు వేరుకు చిటికెడు పసుపు కలిపి నైవేద్యంగా పెట్టడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల దేవగురువు బృహస్పతి మీ జతకంలో బలంగా ఉంటాడు.దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఎవరికైనా పెళ్లికి అడ్డంకులు ఎదురైతే అది కూడా వెంటనే దూరమైపోతుంది.
హిందూమతంలో జమ్మి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ చెట్టుని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు.
ఈ చెట్టు ను రాముడు కూడా పూజించాడు.ఈ చెట్టు వినాయకుడు మరియు శని దేవుడు కూడా ఎంతో ఇష్టమైనది.
అంతే కాకుండా జమ్మి చెట్టు ఆకులను కూడా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

LATEST NEWS - TELUGU