గణేషుని పుత్రిక సంతోషీ మాత జన్మ వృత్తాంతం తెలుసా?

సంతోషి మాత గురించి తెలియని వారుండరు.కానీ ఉత్తర భారత దేశంలోనే ఎక్కువగా సంతోషి మాతను కొలుస్తారు.

 Do You Know Santhoshi Matha Birth Secret, Santhishi Mata, Devotional, Ganesha ,p-TeluguStop.com

దేశమంతటా కొలుస్తున్నప్పటికీ… ఉత్తర భారత దేశంలోనే సంతోషి మాత భక్తులు ఎక్కువగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఆలయాలు కూడా ఉత్తర భారతంలోనే ఎక్కువగానే ఉన్నాయి.

అయితే అసలు సంతోషీ మాత ఎవరు… ఆమె వినాయకుడి కూతురుగా ఎలా మారిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి గణేష పుత్రులైన క్షేమ, లాభములు సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీగకగా చెప్పబడిన రక్షా బంధనం తమకు కూడా చేసుకోవాలని ఉందని విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడిని కోరుతారు.

అయితే తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో ఒక ఆడ పిల్లని తయారు చేయాలనుకుంటాడు.అయితే ఆ సంకల్పమే తన నేత్రాల నుంచి ఒక జ్యోతిగా వెలువడి బాలిక రూపం ధరించింది.

ఆ తర్వాత గణేష పుత్రులైన క్షేమ లాభాలకు రాఖీ కట్టింది.అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కల్గించింది కాబట్టి ఆమెకు సంతోషీ దేవతగా, సంతోషీ మాతగా మారినట్లు చెబుతుంటారు.

అయితే సంతోషీ మాతను పూజించే వారు నీచు, మాంసాహారాలను అస్సలే ముట్టుకోరు.ముఖ్యంగా సంతోషీ మాతకు ఇష్టమైన శుక్ర వారాల్లో మరింత నిష్ఠగా ఉంటారు.

వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారి కృప పొందేవారు ఎంతో మంది.అయితే తన భక్తుల కోరికలను తీర్చడంలో సంతోషీ మాత ఎప్పుడూ ముందే ఉంటుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube