కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో నూతన ఆధునిక రైతు బజార్ ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు ,మాంత్రి మల్లారెడ్డి,mlc శంభిపూర్ రాజు,mlc నవిన్ రావు,mla మాధవరం కృష్ణారావు.దేవుడి తరువాత దేవుడంతటి వారు రైతులేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 15 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్ ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాగరికత పెరిగేకొద్దీ ప్రజలు సుఖప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నారని, సూపర్ మార్కెట్ లకు తీసి పోకుండా రైతు బజార్, సమీకృత మార్కెట్ లను అందుబాటులోకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
ఆధునిక రైతు బజార్ లను అందుబాటులోకి తీసుకు వచ్చి రైతులకు దళారుల బాధ లేకుండా, పండించిన కూరగాయలను విక్రయించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రైతుల వద్దకు వెళ్లిన మంత్రి వారితో మాట్లాడారు, ఈ మహిళా రైతు వద్ద చిక్కుడు కాయలను కొనుగోలు చేశారు.







