బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు పోవ‌డం లేదా..అయితే ఈ టిప్స్ మీకే?

తినేట‌ప్పుడో, ఏదైనా ప‌ని చేసేట‌ప్పుడో, టీ, కాఫీ తాగేట‌ప్పుడో బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు ప‌డుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని మ‌ర‌క‌లు ఎంత ఉతికినా పోనే పోవు.

 How To Remove Stains From Clothes! Remove Stains From Clothes, Clothes, Stains,-TeluguStop.com

దాంతో ఎంత ఖ‌రీదు చేసే బ‌ట్ట‌లైనా.మ‌ర‌క‌ల వ‌ల్ల‌ చెండాలంగా క‌నిపిస్తాయి.

అందులోనూ తెల్ల బ‌ట్ట‌లైతే.ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన ప‌ని లేదు.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే.బ‌ట్ట‌ల‌పై సుల‌భంగా మ‌ర‌క‌ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌ట్ట‌ల‌పై ఉన్న మొండి మ‌ర‌క‌ల‌ను మ‌టుమాయం చేయ‌డంలో వెనిగ‌ర్ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

మ‌ర‌క‌లు ఉన్న ప్రాంతంలో కొద్దిగా వెనిగ‌ర్ వేసి బాగా ర‌బ్ చేసి.అనంత‌రం సోప్‌తో క్లీన్ చేయాలి.

ఇలా చేస్తే మ‌ర‌క‌లు ఇట్టే పోతాయి.

అలాగే బంగాళ‌దుంపతో కూడా బ‌ట్ట‌ల‌పై ప‌డ్డ మ‌ర‌క‌ల‌ను నివారించ‌వ‌చ్చు.

ముందుగా బంగాళ దుంప నుంచి ర‌సం తీసుకుని.దాన్ని మ‌ర‌క‌లు ఉన్న చోటు వేసి బాగా రుద్దాలి.

ఆ త‌ర్వాత కొంత స‌మ‌యం పాటు డిట‌ర్జెంట్ లో నాన బెట్టి క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Latest, Lifestyle, Remove Stains, Stains-Telugu Health - తెలుగ

బట్ట‌ల‌పై మ‌ర‌క‌లు ఉన్న చోట కొద్దిగా బేకింగ్ పౌడ‌ర్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు ర‌బ్ చేయాలి.అనంత‌రం వేడి నీటిలో కొద్ది స‌మ‌యం పాటు నాన బెట్టి.ఇప్పుడు సోప్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మ‌ర‌క‌లు పోతాయి.

ఇక శీకాయపొడితో బ‌ట్ట‌ల‌పై ప‌డ్డ మ‌ర‌క‌ల‌ను సులువుగా పోగొట్టుకోవ‌చ్చు.ముందుగా శీకాయ‌పొడిలో కొద్దిగా వాటర్ మీక్స్ చేసి.

దాన్ని మ‌ర‌క‌లు ఉన్న చోటు వేసి రుద్దాలి.ఆ త‌ర్వాత వేడినీటితో బ‌ట్ట‌ల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేసినా బ‌ట్ట‌ల‌పై ఉన్న మ‌ర‌క‌లు పూర్తిగా తొల‌గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube