చాలా మంది మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తారు.యూఎస్ ఆరోగ్య సంస్థ సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం, గర్భనిరోధక మాత్రలను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే.అవి 99.7 శాతం వరకు గర్భధారణను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిర్ధారణ అయ్యింది.అయితే ఈ మాత్రల కారణంగా మహిళల్లో గర్భం ఎలా ఆగిపోతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాత్రలు ఎలా పని చేస్తాయో తెలుసా? హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం గర్భనిరోధక మాత్రలలో కృత్రిమ స్టెరాయిడ్ హార్మోన్లు ఉంటాయి.స్త్రీ శరీరంలోకి చేరిన ఈ మాత్రలు.
పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఈ చర్య గర్భధారణను నివారించడంలో సహాయపడుతుంది.
ఈ మాత్రల వలన అండోత్సర్గమనే ప్రక్రియ ఆగిపోతుంది.అప్పుడు పిండం ఏర్పడే పరిస్థితులు ఉండవు.
దీంతో గర్భధారణ ఆగిపోతుంది.అయితే ఈ మాత్రలు వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
గర్భనిరోధక మాత్రలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.వైద్యుల సలహా లేకుండా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
తలనొప్పి, నిద్రపట్టడంలో ఇబ్బంది, అలసట, మానసిక వ్యాకులత, బరువు పెరగడం, నిరాశకు గురికావడం జరుగుతుంది.