ఇంతకంటే దిగజారి పోవద్దు... డైరెక్టర్ గీతా కృష్ణకు కౌంటర్ ఇచ్చిన కోటి! 

పాడుతా తీయగా(Paadutha Theeyaga) కార్యక్రమం గురించి సింగర్ ప్రవస్తి(Pravasti) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఇప్పటికి ఈ విషయంపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ వచ్చారు.

 Music Director Koti Gives Strong Counter To Director Geetha Krishna ,geetha Kris-TeluguStop.com

అయితే కొంతమంది సింగర్ ప్రవస్తికి మద్దతు నిలువగా మరికొందరు కీరవాణి (Keeravani) సునీతకు(Sunitha) మద్దతుగా నిలుస్తున్నారు.అయితే ఈ వివాదం గురించి డైరెక్టర్ గీతాకృష్ణ(Geetha Krishna) స్పందించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన కీరవాణి గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

కీరవాణి నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు అయితే ఆయన ఒక వ్యభిచారి అని స్కూల్ పిల్లలను పంపించమని చెప్పేవారు అంటూ గీతా కృష్ణ మాట్లాడారు.

ఇలాంటి వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి అంటూ కీరవాణి గురించి గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు కోటి(Koti) స్పందిస్తూ గీతాకృష్ణకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

Telugu Geetha Krishna, Keeravani, Koti, Musickoti, Sunitha-Telugu Top Posts

ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.గీతా కృష్ణ గారు మీరు ఒకప్పుడు ఎంతో గొప్ప డైరెక్టర్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు కే విశ్వనాథ్ వంటి గొప్ప దర్శకుల వద్ద శిష్యరికం పొందారు.కానీ ఈ మధ్య మీరు చేస్తున్న కామెంట్స్ కాస్త పరిధి దాటుతున్నాయి.

కీరవాణి సునీత చంద్రబోస్ గురించి మీరు ఏవేవో మాట్లాడుతున్నారు వారంతా మా ఫ్యామిలీ.వారు ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో మాకు తెలుసు.

ఇక్కడ ఏదో తప్పు జరిగిపోలేదు.కానీ మీరు పర్సనల్ గా అటాక్ చేస్తున్న విధానం కరెక్ట్ కాదు.

దయచేసి ఇలా హద్దులు దాటి పర్సనల్ గా మాట్లాడొద్దని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు.ప్రతి కార్యక్రమంలోను చిన్నచిన్న లోటుపాట్లు ఉంటాయి.

వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని మీ మాటలకు నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ కోటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube