ఆడవారి లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు.వయసు పెరిగే కొద్దీ వారి జీవితంలోనే కాకుండా శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.
శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి.వాటిని తట్టుకుని నిలబడాలంటే కచ్చితంగా లేడీస్ అందరూ కొన్ని పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆ పోషకాలు ఏంటి.? వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతారు.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్( Iron ) ఆడవారికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకమిది.నెలసరి కారణంగా సహజంగానే చాలామంది మగువలు రక్తహీనత బారిన పడతారు.రక్తహీనతను వదిలించడానికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి ఐరన్ అవసరం అవుతుంది.
ఐరన్ కోసం ఖర్జూరం, నువ్వులు, పాలకూర, డ్రై ఫ్రూట్స్ ( Dates, sesame seeds, lettuce, dry fruits )ను తీసుకోండి.ఆడవారు తమ శరీరానికి తప్పనిసరిగా అందించాల్సిన పోషకాల్లో మెగ్నీషియం( Magnesium) ఒకటి.
మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి అండగా నిలబడడమే కాకుండా.నెలసరి నొప్పులకు చెక్ పెడుతుంది.
భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.కండరాలను బలోపేతం చేస్తుంది.
మెగ్నీషియం కోసం నట్స్, డార్క్ చాక్లెట్, అవకాడో, అరటి పండు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు తినండి.

అలాగే ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి, నరాల పనితీరుకు, హార్మోన్ల సమతుల్యతకు ఆడవారు కాల్షియంకు కచ్చితంగా తీసుకోవాలి.కాల్షియం కొరకు పాలు, పెరుగు, నెయ్యి, జున్ను, తృణధాన్యాలు, బాదం, అంజీర్ వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.ఆడవారి ఆరోగ్యానికి అవసరమయ్యే మరో ముఖ్యమైన పోషకం విటమిన్ డి.ఇది శరీరంలో ఒక హార్మోన్ లా పనిచేస్తుంది.ఆహారం నుండి ఎక్కువ కాల్షియంను గ్రహించడంలో విటమిన్ డి సహాయపడుతుంది.
సూర్యుడి ద్వారా విటమిన్ డి ని పొందవచ్చు.చేపలు, గుడ్డు, పుట్టగొడుగులు తదితర ఆహారాల్లో కూడా విటమిన్ డి ఉంటుంది.
ఇక గుండె ఆరోగ్యానికి, నరాల పనితీరుకి, శక్తి ఉత్పత్తికి, జీర్ణక్రియకి, ఆకలి నియంత్రణకి, కంటి ఆరోగ్యగ్యానికి ఫోలేట్ ను తీసుకోవడం ఎంతో ముఖ్యం.ఫోలేట్ కోసం ఆకుకూరలు, బీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు, బొప్పాయి, బ్రోకలీ వంటి ఫుడ్స్ ను తీసుకోండి.