నడుము నొప్పి( back pain ).స్త్రీ పురుషుల్లో చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండటం లేదా నిలబడి ఉండడం, వెన్నెముకకు అధిక శ్రమను కలిగించడం, పోషకాలు కొరత, అధిక బరువు, హైహీల్స్ వేసుకుని నడవడం తదితర కారణాల వల్ల నడుము నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్లర్స్ వైపు మొగ్గు చూపుతారు.
అవి తాత్కాలికంగా ఉపశమనాన్ని అందించిన దీర్ఘకాలికంగా అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.
కానీ ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కాలను ఫాలో అయ్యారంటే సహజంగానే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.
మరి లేటెందుకు ఆ వంటింటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.నడుము నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడానికి నువ్వుల నూనె చాలా బాగా సహాయపడుతుంది.ఒక చిన్న కప్పు నువ్వుల నూనెలో( sesame oil ) ఐదు నుంచి ఆరు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను( Garlic cloves ) మరిగించి.ఆ ఆయిల్ తో నడుమును మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే నడుము నొప్పి నుంచి బయటపడడానికి మీకు శొంఠి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.ఒక గ్లాస్ వాటర్ లో టీ స్పూన్ శొంఠి పొడి వేసి ఐదారు నిమిషాల పాటు మరిగించి తీసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే నడుము నొప్పి దెబ్బకు పరార్ అవుతుంది.కొబ్బరి నూనె, వంట కర్పూరం( Coconut oil, cooking camphor ) తో కూడా నడుము నొప్పిని వదిలించుకోవచ్చు.
వంట కర్పూరం బిల్లలను కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి.ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత నడుముకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఇలా చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.

ఇక వీటితో పాటు నడుము నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలు ఉంటాయి.అవి నిత్యం చేయడం అలవాటు చేసుకోండి.డైట్ లో కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, గుడ్లు, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఆహారాలు ఉండేలా చూసుకోండి.
ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా మార్చడానికి చాలా బాగా సహాయపడతాయి.







