ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం ఎంతో ఉందని దాదాపు చాలా మందికి తెలుసు.రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వాన కాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి.
అందుకే ఈ సీజన్లో కొన్ని ఆహారాలను కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి.ఎందుకంటే ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి.
వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది.అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి జ్వరం, దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ డైట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఆపిల్స్ ( Apples )లో విటమిన్ సి, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి.ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా ఈ పండ్లను తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం ఉండదు.ఇంకా చెప్పాలంటే బొప్పాయి ( Papaya )కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.ఇలాంటి బొప్పాయిని ఈ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే పసుపులో ఉండే కర్కుమిన్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి మన శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పసుపును కూడా ఆహారంలో చేర్చుకోవాలి.ఇంకా చెప్పాలంటే దానిమ్మ పండ్లలో( Pomegranate ) పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
వీటిని తీసుకుంటే వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే చర్మ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.
అంతే కాకుండా ఇది మీ లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.