రక్తహీనత( Anemia ) అనేది ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య.రక్తహీనత నుంచి బయటపడడానికి కొందరు మందులు వాడుతుంటారు.
ఇంకొందరు ఫుడ్ ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటారు.రక్తహీనతను తరిమికొట్టే ఆహారాలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు చెప్పబోయే లడ్డు ( Laddu ) కూడా ఆ కోవకే చెందుతుంది.ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే రక్తహీనత నుంచి కొలెస్ట్రాల్( Cholestrol ) వరకు అనేక సమస్యలు పరారవుతాయి.
లడ్డూ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు నువ్వులు( Sesame Seeds ) వేసి దోరగా వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న నువ్వులను చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని బౌల్ లోకి వేసుకోవాలి.
ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో దాదాపు 15 గింజ తొలగించిన ఖర్జూరాలను( Dates ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఖర్జూరం విశ్రమంలో గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.
ఈ నువ్వుల ఖర్జూరం లడ్డూ ఎంతో రుచికరంగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

ముఖ్యంగా ఈ లడ్డూలో ఐరన్ కంటెంట్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది.అందువల్ల నిత్యం ఈ లడ్డూను తింటే శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్( Hemoglobin Levels ) పెరుగుతాయి.రక్తహీనత సమస్య దూరం అవుతుంది.అలాగే ఈ నువ్వుల ఖర్జూరం లడ్డూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఈ లడ్డూలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ మరియు ఫినోలిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

నువ్వుల ఖర్జూరం లడ్డూను నిత్యం తీసుకుంటే అందులో జింక్, ఐరన్, విటమిన్ ఇ రోగ నిరోధక శక్తిని పెంచతాయి.ఫలితంగా తరచూ రోగాల బారిన పడకుండా ఉంటారు.అంతేకాకుండా ఈ లడ్డూలో కాల్షియం మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా మారుస్తాయి.కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ టేస్టీ లడ్డూ తోడ్పడుతుంది.