ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని పూజలు చేసి సంతోషంగా వెళుతూ ఉంటారు.కానీ శ్రీవారి కొన్ని సేవలు కొన్ని అత్యవసర పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మార్పులు చేస్తూ ఉంటారు.
ఆ మార్పులను తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగానే తెలుసుకొని వస్తే ఎటువంటి సమస్యలు భక్తులకు ఉండవు.ముఖ్యంగా తిరుమల దేవాలయంలో శుక్రవారం నిర్వహించనున్న పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసినట్లు సమాచారం.
ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ వారికి గరుడ సేవ నిర్వహిస్తూ ఉంటారు.అయితే ఈసారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.
భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉంది.శ్రీవారి దేవాలయంలో 25 రోజుల పాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ఈ నెల మూడవ తేదీ రాత్రి మొదలయ్యాయి.
ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.దీనివల్ల పౌర్ణమి గరుడ సేవ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా గవర్నర్ భీష్మభూషణ్ హరి చందన్ గురువారం తిరుపతికి వస్తున్నారు.ఈ మేరకు కలెక్టర్ వెంకట రామారెడ్డి వెల్లడించారు.11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ ఉత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారని వెల్లడించారు.తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.ఈనెల 2 నుంచి వైకుంఠ ద్వార దర్శనం మొదలు కావడం వల్ల భక్తులు భారీగా వస్తున్నారు.
కేవలం దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తున్నారు.అయినప్పటికీ కొందరు భక్తులు త్వరగా, మరికొందరికి ఐదు నుంచి ఆరు గంటల కు పైగా దర్శనానికి సమయం పడుతుంది.
దీనివల్ల నిర్వహణపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు గంటలు తరబడి కంపార్ట్మెంట్లలో వేచి ఉంటున్నారు.కనీస సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
DEVOTIONAL