చాలామంది మెగా ఫ్యామిలీ హీరోలు అసలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయరు అని అపవాదును ఆ ఫ్యామిలీపై వేస్తూ ఉంటారు.మెగాస్టార్ అయ్యారు అంటే దానికి కారణం అభిమానులే.
అభిమానులకు ఏదైనా సందేశం ఇస్తూ ఒక సినిమా చేయొచ్చు కదా అనేది కొందరి వాదన.మరికొందరు కమర్షియల్ సినిమాలు తీస్తేనే కలెక్షన్స్ వస్తాయి.
అలాంటి సినిమాలు తీస్తేనే కదా నిర్మాతకు నాలుగు డబ్బులు వచ్చి మరిన్ని సినిమాలు తీసి కొంత మందికైనా ఉపాధి కల్పించగలడు.అని మరి కొంతమంది వాదన.
ఏది ఏమైనా రెండు వాదనలను న్యాయం ఉంది కానీ చిరంజీవి( Chiranjeevi ) కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తాడు అనేది కూడా కరెక్ట్ కాదు.ఆయన సందేశాత్మక సినిమాలు చాలానే తీశాడు.
సందేశాత్మక సినిమాలు తీద్దాము అనుకున్న ప్రతిసారి అవి కమర్షియల్ ఫార్ములాను( commercial ) కలిగి ఉండాలి అనే రూల్ కూడా లేదు అలా అని ఉండకూడదు అని అభిప్రాయం కూడా వద్దు.కొన్నిసార్లు కమర్షియల్ విలువలతోనే సందేశాలు కూడా జోడించడం మెగాస్టార్ సినిమాలకు మాత్రమే చెల్లింది.అందులో ముఖ్యంగా ఠాగూర్, స్టాలిన్, స్వయంకృషి, శుభలేఖ, అభిలాష ( Tagore, Stalin, Swayamkrishi, Shubhlekha, Abilasha )లాంటి చిత్రాలకు ముందు స్థానం దొరుకుతుంది వీటిలో కొన్ని డబ్బుల పరంగా మరియు కమర్షియల్ హంగులతో కూడి మెసేజ్ ను కూడా చాలా చక్కగా జనాలకు రీచ్ ఎలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఒక సినిమా రుద్రవీణ ఈ సినిమా కులాలకు, మతాలకు అతీతంగా జాతి ఉద్దేశాలకు దూరంగా ఉండాలంటూ, పేద, మధ్య తరగతి కుటుంబాలు అలాగే మతాచారాలపై ఎక్కుపెట్టిన బాణంలా పనిచేసింది.
కానీ పూర్తిస్థాయిగా కమర్షియల్ హంగులు లేకుండా తీసిన రుద్రవీణ( Rudravina ) 80 లక్షల తో పూర్తి చేయగా 60 లక్షల నష్టాలను చవిచూసేలా చేసింది కేవలం 20 లక్షలు మాత్రమే వసూల్లను సాధించింది ఈ చిత్రం.మరి స్టాలిన్ సినిమా కూడా మంచి మెసేజ్ తో కూడుకున్న చిత్రమే ఒక ముగ్గురికి సహాయం చేయాలి ఆ ముగ్గురుని మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పాలి.ఇలా ప్రతి ఒక్కరూ ముగ్గురికి చెబుతూ పోతూ ఉండాలి.ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేయాలి అంటూ చెప్పే సందేశం.దీంతో పాటు ఆ పాటలు, ఫైట్, కామెడీ అన్ని జోడించి వివి వినాయక్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తే మంచి విజయాన్ని అందుకుంది.మరి ఇలాంటి కమర్షియల్ మరియు సందేశం ఇచ్చే సినిమా చిరంజీవి తప్ప మరి ఎవరైనా చేయగలరా ? ఈ ఆర్టికల్ చదివిన వారైనా చిరంజీవి కమర్షియల్ హీరో అంటూ చెప్పద్దు ప్లీజ్.