వీర్యం పల్చగా వస్తే చాలు ఎక్కడలేని కంగారు పుట్టేస్తుంది మగవారికి.ఏదో జరిగిపోయింది, ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయిందన్న భావనకి వచ్చేస్తారు.
అలా రావడం ప్రమాదకరమైన విషయం కాదు కాని, పల్చటి వీర్యంలో ప్రోటీన్‌లు మాత్రం తగ్గుతాయని చెబుతారు పరిశోధకులు.మరి వీర్యం పల్చగా రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా ?
* హస్తప్రయోగం అతిగా చేసినా, వీర్యం పల్చగా వస్తుంది.అయితే పూర్తిగా పల్చగా మారిపోదు.కాని వీర్యం ఉత్పత్తి బాగా జరగటానికి కొంత సమయం విరామం ఇస్తే మంచిది.
* ఆహారపు అలవాట్లు కూడా వీర్యాన్ని పల్చగా మార్చేస్తాయి.వీర్యం చిక్కగా ఉండటానికి ప్రోటీన్‌లు కారణం.
ప్రోటీన్‌ల ఇంటేక్ తక్కువగా ఉంటే వీర్యం పల్చగా రావొచ్చు.కాబట్టి ప్రోటీన్‌లు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి.
* బట్టలు బాగా టైట్ గా ఉండి, గాలి సరిగా ఆడక, ఆ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటే కూడా వీర్యం పల్చగా వస్తుంది.
* ప్రమాదవశాత్తు సెమినల్ వెసిల్ లో బ్లాకేజ్ వలన కూడా వీర్యం పల్చగా రావొచ్చు.
* ప్రొస్టేటు ఇంఫెక్షన్, డయాబెటిస్ కూడా వీర్యం పల్చబడటానికి కారణమవుతాయి.
* టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడం వీర్యకణాల ఉత్పత్తిని తగ్గించడమే కాదు, వీర్యం పల్చబడటానికి కారణం అవుతుంది.
* నీళ్ళు తక్కువగా తాగే అలవాటు ఉంటే కూడా వీర్యం పల్చబడవచ్చు.కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం తప్పనిసరి.
* కొన్నిరకాల మెడికల్ డ్రగ్స్ కూడా వీర్య ఉత్పత్తిపై నెగెటివ్ ప్రభావం చూపుతాయి.వీర్యం పల్చగా రావడానికి ఇది కూడా కారణం కావచ్చు.